ప్రభుత్వ వైఫల్యం హత్య దారుణం
రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ విఫలం
అమరావతి – ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి నిప్పులు చెరిగారు. కూటమి ప్రభుత్వం వచ్చినా రాష్ట్రంలో పరిస్థితులలో ఎలాంటి మార్పు కనిపించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం ట్విట్టర్ ఎక్స్ వేదికగా తీవ్రంగా స్పందించారు.
దేశ వ్యాప్తంగా సంచలనం కలిగించిన ఏపీలోని వినుకొండ హత్య చేసిన సంఘటన ప్రతి ఒక్కరినీ కలిచి వేసిందని పేర్కొన్నారు. అసలు మనం ఎక్కడికి వెళుతున్నామో అర్థం కావడం లేదని వాపోయారు. ఇదేనా కూటమి ప్రజా ప్రభుత్వం అంటే అని ప్రశ్నించారు.
హత్యా రాజకీయాలను పక్కన పెట్టి లా అండ్ ఆర్డర్ ఏమై పోయిందని ప్రశ్నించారు. అలా పబ్లిక్ గా ఓ మనిషిపై పాశవికంగా దాడి చేస్తూ..నరికి చంపుతుంటే చూస్తూ ఊరుకుంటే ఎలా అని అన్నారు వైఎస్ షర్మిలా రెడ్డి. ఈ ఘటన అత్యంత దారుణం, బాధాకరమని కన్నీటి పర్యంతం అయ్యారు. దీనిని ఖండిస్తున్నట్లు తెలిపారు.
నడిరోడ్డు మీద ఆటవికంగా నరుక్కుంటుంటే పోలీసులు ఏమి చేస్తున్నారంటూ మండిపడ్డారు. ఇది వ్యక్తిగత కక్షల వల్ల అయితే నేరస్తుడిని వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాల ని డిమాండ్ చేశారు.
ఒకవేళ ఇది రాజకీయ హత్య అయితే, కూటమి సర్కారుకు ఇదే హెచ్చరిక. ఇటువంటి ఘటనలు ఆదిలోనే ఆపకపోతే ఇది మీకు, రాష్ట్రానికి మంచిది కాదన్నారు వైఎస్ షర్మిల. నాగరిక సమాజంలో ఇలాంటి దుశ్చర్యలకు తావు లేదన్నారు.