ఇందిరమ్మ అభయం పేదలకు వరం
ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి
అనంతపురం – ఇందిరమ్మ అభయం పేదలకు వరం లాంటిదని అన్నారు ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి. ఏపీ పీసీసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ఆమె ప్రసంగించారు. రాష్ట్రంలో పాలన గాడి తప్పిందన్నారు. ప్రజలకు జగన్ భారంగా మారారని ఆరోపించారు. ఇందిరమ్మ అభయం పేరుతో తొలి గ్యారెంటీ ప్రకటిస్తున్నామని చెప్పారు. ప్రతి పేద కుటుంబానికి నెలకు రూ. 5 వేలు ఇస్తామని హామీ ఇచ్చారు వైఎస్ షర్మిల.
మహిళల పేరు మీదనే చెక్కులు పంపిణీ చేస్తామన్నారు. ఈ దేశానికి పునాది వేసింది కాంగ్రెస్ పార్టీ అని, దానిని మరిచి పోతే ఎలా అని ప్రశ్నించారు. మెట్టు మెట్టు కట్టుకుంటూ నిర్మాణం చేసిందన్నారు. అసమానతలు తొలగించేందుకే ఈ నూతన ఆలోచన చేయడం జరిగిందన్నారు వైఎస్ షర్మిల.
రాష్ట్రం ఏర్పడి పది ఏళ్లవుతున్నా అభివృద్దిలో ఒక్క అడుగు ముందుకు పడలేదని ఆరోపించారు. చంద్రబాబు నాయుడు, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలనలో ఏపీ 25 ఏళ్లు వెనక్కి వెళ్లిందన్నారు. ఒక్క పరిశ్రమ కూడా రాష్ట్రానికి తీసుకు రాలేదని , మరి దేని కోసం ఓట్లు అడుగుతారంటూ ప్రవ్నించారు వైఎస్ షర్మిలా రెడ్డి.