డీకే శివకుమార్ షర్మిల కీలక భేటీ
కీలక అంశాలపై చర్చలు
అమరావతి – కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ బుధవారం ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డితో భేటీ అయ్యారు. ఈ సందర్బంగా జాతీయ అంశాలతో పాటు రెండు రాష్ట్రాలకు సంబంధించిన అంశాలపై చర్చించారు.
ఇదిలా ఉండగా కాంగ్రెస్ పార్టీలో డీకే శివకుమార్ ట్రబుల్ షూటర్ గా పేరు పొందారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీని బతికించేందుకు ఆయన కంకణం కట్టుకున్నారు. ఇదే సమయంలో ఇటు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పవర్ లోకి రావడంలో కీలకమైన పాత్ర పోషించారు డీకే శివకుమార్.
గతంలో కోల్పోయిన ప్రాభవాన్ని తిరిగి తీసుకు వచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు . ఇందులో భాగంగానే వైఎస్ షర్మిలా రెడ్డిని ఏపీలో ఎంటర్ అయ్యేలా చేయడంలో ముఖ్య భూమిక పోషించారు. ఇటు రేవంత్ రెడ్డికి కూడా ఆయన వెన్ను దన్నుగా నిలిచారు.
ఇవాళ తన ముందున్న ప్రధాన లక్ష్యం పార్లమెంట్ ఎన్నికల్లో కర్ణాటక, ఏపీ, తెలంగాణలో సాధ్యమైనంత మేర తమ పార్టీకి ఎక్కువ ఎంపీ సీట్లు తీసుకు రావాలని. ఆ దిశగా పావులు కదుపుతున్నారు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్.