రామోజీరావు మరణం విషాదకరం
ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి
అమరావతి – ఈనాడు సంస్థల చైర్మన్ చెరుకూరి రామోజీరావు మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి. శనివారం ట్విట్టర్ వేదికగా ఆమె స్పందించారు. అక్షర యోధులు, అనేక రంగాలలో అద్భుతమైన విజయాలు అందుకుని, భావి తరాలకు స్ఫూర్తిగా నిలిచిన విశిష్టమైన వ్యక్తి, రామోజీ రావు అని పేర్కొన్నారు.
ఆయన మరణం అత్యంత విషాదకరమని , ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు. రామోజీ సంస్థల అధిపతిగా ఆయన సాగించిన ప్రస్థానం గురించి ఎంత చెప్పినా తక్కువే. శుక్రవారం తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. హుటా హుటిన ఆస్పత్రికి తరలించారు. శనివారం తెల్లవారుజామున 4.50 గంటలకు తుది శ్వాస విడిచారు.
అక్షర యోధుడుగా రామోజీ తెలుగు రాష్ట్రాలకు, దేశానికి ఎన్నో సేవలు అందించారని కొనియాడారు. 1974లో ఈనాడు పత్రికను విశాఖలో ప్రారంభించారు. అంచెలంచెలుగా ఎదిగారు. ఒక రకంగా రెండు తెలుగు రాష్ట్రాలను శాసించారు రామోజీరావు. చివరకు తను కోట్లాది రూపాయల విలువ చేసే ఆస్తులను సంపాదించి పెట్టారు.
తన పత్రికను అడ్డం పెట్టుకుని మోసాలకు పాల్పడినట్లు ఆరోపణలు కూడా ఉన్నాయి ఆయనపై.