Monday, April 21, 2025
HomeNEWSANDHRA PRADESHఅమిత్ షా కామెంట్స్ ష‌ర్మిల సీరియ‌స్

అమిత్ షా కామెంట్స్ ష‌ర్మిల సీరియ‌స్

తక్ష‌ణ‌మే రాజీనామా చేయాలి
బాబాసాహెబ్ అంబేద్కర్ పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు బీజేపీ అహంకారానికి నిదర్శనమ‌న్నారు ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిల. భారత రాజ్యాంగానికి ఇది ఘోర అవమానమ‌న్నారు.
అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని రద్దు చేసి మనుస్మృతిని తీసుకు రావాల‌ని షా ప్ర‌య‌త్నిస్తున్నార‌ని ధ్వ‌జ‌మెత్తారు. దళిత, గిరిజన, బీసీ, మైనారిటీ ప్రజల మనోభావాలు తీవ్రంగా దెబ్బ తీసిన‌ట్టేన‌ని ఆరోపించారు.

మ‌ను స్మృతిని తిరిగి తీసుకు రావాల‌ని సంఘ్ ప‌రివార్ కుట్ర ప‌న్నుతోంద‌ని, అందులో భాగంగానే అమిత్ షా అంబేద్కర్ పై నోరు పారేసుకున్నార‌ని ఆరోపించారు వైఎస్ ష‌ర్మిల‌. మనుస్మృతిని బీజేపీ విశ్వసిస్తుంది కాబట్టే అనుక్షణం రాజ్యాంగంపై దాడి చేస్తోందని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. రాజ్యాంగ నిర్మాతను ప్రతి సారి హేళన చేయ‌డం ప‌రిపాటిగా మారింద‌న్నారు.

మన రాజ్యాంగం మీద, మన జాతీయ జెండా మీద బీజేపీకి గౌరవం లేదని మరోసారి నిరూపితం అయ్యిందన్నారు. అంబేద్కర్ ను అవమానించినందుకు అమిత్ షా వెంటనే క్షమాపణలు చెప్పాలని, త‌క్ష‌ణ‌మే కేంద్ర మంత్రి ప‌ద‌వికి రాజీనామా చేయాల‌ని డిమాండ్ చేశారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments