NEWSANDHRA PRADESH

వెంక‌ట్ రెడ్డి స‌రే మిగ‌తా తిమింగ‌లాల‌ మాటేంటి..?

Share it with your family & friends

నిప్పులు చెరిగిన ఏపీపీసీసీ చీఫ్ ష‌ర్మిలా రెడ్డి

విజ‌య‌వాడ – ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిలా రెడ్డి నిప్పులు చెరిగారు. గ‌త వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన గనుల దోపిడీపై వెంకట్ రెడ్డి లాంటి తీగలే కాదు… పెద్ద డొంకలు కూడా కదలాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు.

శ‌నివారం వైఎస్ ష‌ర్మిలా రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఆ పెద్ద డొంక ఏ ప్యాలెస్ లో ఉన్నా..విచారణ జరపాల్సిందేన‌ని డిమాండ్ చేశారు. రూ.2,566 కోట్ల దోపిడీకి పాల్పడ్డ ఘనుడు వెంకట్ రెడ్డి అయితే…తెర వెనుక ఉండి, సర్వం తానై, వేల కోట్లు కాజేసిన ఆ ఘనాపాటి ఎవరో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసన్నారు ష‌ర్మిలా రెడ్డి.

గ‌త‌ 5 ఏళ్లుగా రాష్ట్రంలో అడ్డగోలుగా సహజ సంపదను దోచుకు తిన్నారని ఆరోపించారు. అస్మదీయ కంపెనీలకు మైనింగ్ కాంట్రాక్టులు ఇచ్చారని మండిప‌డ్డారు. టెండర్లు , ఒప్పందాలు, ఏపీఎంఎంసీ నిబంధనలన్ని బేఖాతరు చేసి అనుకున్న కంపెనీకి టెండర్లు కట్ట బెట్టార‌ని ఆరోపించారు వైఎస్ ష‌ర్మిలా రెడ్డి.

ఎన్జీటీ (NGT) నిభందలను తుంగలో తొక్కి, రాష్ట్ర ఖజానాకు రావాల్సిన నిధులు సొంత ఖజానాకు తరలించారని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. గత ప్రభుత్వ హయంలో జరిగిన మైనింగ్ కుంభకోణంపై ACB విచారణతో పాటు..పూర్తి స్థాయిలో సమగ్ర దర్యాప్తు జరపాల్సిన అవసరం ఉంద‌న్నారు.

చిన్న చేపలను ఆడించి సొమ్ము చేసుకున్న పెద్ద తిమింగలాన్ని పట్టుకొనేలా దర్యాప్తు జరగాలన్నారు.