NEWSANDHRA PRADESH

కాంగ్రెస్ పార్టీ బ‌లోపేతంపై ష‌ర్మిల ఫోక‌స్

Share it with your family & friends

జిల్లాల వారీగా స‌మీక్షించ‌నున్న ప్రెసిడెంట్

విజ‌య‌వాడ – ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బ‌లోపేతంపై దృష్టి సారించారు ఆ పార్టీ చీఫ్ వైఎస్ ష‌ర్మిలా రెడ్డి. ఇవాల్టి నుంచి బెజ‌వాడ‌లోనే ఉండ‌నున్నారు. పార్టీ బలోపేతంపై జిల్లా అధ్యక్షులు, నియోజక వర్గ, మండల స్థాయి నేతలతో సమీక్షలు నిర్వహిస్తున్నారు. అక్టోబ‌ర్ 24న మధ్యాహ్నం శ్రీకాకుళం జిల్లా నేతలతో సమీక్ష చేప‌ట్టారు వైఎస్ ష‌ర్మిలా రెడ్డి.

25న శుక్ర‌వారం అరకు, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాలకు సంబంధించిన పార్టీ అధ్యక్షులు, మండ‌ల స్థాయి నేత‌ల‌తో స‌మావేశం కానున్నారు. 26న శ‌నివారం కాకినాడ, అమలాపురం, రాజమండ్రి, నరసాపురం జిల్లాలపై స‌మీక్ష చేపడతారు వైఎస్ ష‌ర్మిలా రెడ్డి.

అక్టోబ‌ర్ 27న ఆదివారం రోజు ఏలూరు ,మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు జిల్లాలకు సంబంధించి రివ్యూ చేస్తారు. 28న సోమ‌వారం నంద్యాల , కర్నూలు ,ఒంగోలు, నెల్లూరు జిల్లాల అధ్య‌క్షులు, మండ‌ల స్థాయి నేత‌ల‌తో భేటీ కానున్నారు ఏపీ పీసీసీ చీఫ్‌.

మ‌ధ్యలో దీపావ‌ళి పండుగ ఉండ‌డంతో తిరిగి వ‌చ్చే నెల న‌వంబ‌ర్ 6న న‌ర‌సాపురం, అనంత‌పురం, హిందూపూర్ జిల్లాల అధ్య‌క్షులు , మండ‌లాల బాధ్యుల‌తో స‌మీక్ష చేప‌డతారు. 7 న కడప, రాజంపేట, తిరుపతి, చిత్తూరు జిల్లాల నేతలతో సమీక్ష నిర్వహిస్తారు వైఎస్ ష‌ర్మిలా రెడ్డి.