NEWSANDHRA PRADESH

నాన్నా నీ బిడ్డ నైనందుకు గ‌ర్విస్తున్నా

Share it with your family & friends

ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిలా రెడ్డి

అమ‌రావ‌తి – ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిలా రెడ్డి త‌నకు తండ్రి దివంగ‌త వైఎస్ రాజశేఖ‌ర్ రెడ్డితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. జూన్ 16న ప్ర‌పంచ వ్యాప్తంగా బిడ్డ‌లు తండ్రుల‌ను త‌లుచు కోవ‌డం, గుర్తు తెచ్చు కోవ‌డం, స్మ‌రించు కోవ‌డం ప‌రిపాటిగా వ‌స్తోంది . త‌ర త‌రాలుగా ఇలాంటి సంప్ర‌దాయం క‌లిగి ఉండ‌డం గొప్ప‌నైన విష‌యం .

ఇవాళ ఫాద‌ర్స్ డే సంద‌ర్బంగా వైఎస్ ష‌ర్మిలా రెడ్డి త‌న తండ్రిని త‌లుచుకున్నారు. ఆయ‌న‌కు ఉన్న గొప్ప ల‌క్ష‌ణాల గురించి ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించారు. త‌న‌నే కాదు కోట్లాది మందిని ప్ర‌భావితం చేసిన గొప్ప నాయ‌కుడు వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి అని కొనియాడారు.

నాన్నా నీ పట్టు వదలని పోరాట పటిమను ఆస్తిగా ఇచ్చి ఆగకుండా సాగి పోయేలా నన్ను తీర్చిదిద్దావ‌ని పేర్కొన్నారు. నీ అమూల్యమైన ఆత్మవిశ్వాసాన్ని నాలో నింపి సవాళ్ళను ఎదుర్కొనేలా తయారు చేసావంటూ కొనియాడారు.

మనిషిని ప్రేమ, సంస్కారం, కరుణతో గెలవాలనే సూత్రంతో నా వ్యక్తిత్వాన్ని మలిచావని, నేను నీ బిడ్డ‌నై నందుకు గ‌ర్విస్తున్నాన‌ని అన్నారు వైఎస్ ష‌ర్మిలా రెడ్డి.