ఏపీ కాంగ్రెస్ లో కమిటీలు రద్దు
ప్రకటించిన ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల
అమరావతి – ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఏపీపీసీసీ) చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి సంచలన ప్రకటన చేశారు. ఈ మేరకు పార్టీ సంస్థాగత నిర్మాణంలో భాగంగా ప్రస్తుతం ఉన్న అన్ని పార్టీకి చెందిన కమిటీలను రద్దు చేస్తున్నట్లు స్పష్టం చేశారు.
ప్రస్తుతం అన్ని కమిటీలు అంటూ ఉండవని పేర్కొన్నారు. పార్టీ బలోపేతానికి త్వరలోనే నూతన కమిటీలను ఏర్పాటు చేయడం జరుగుతుందని వెల్లడించారు వైఎస్ షర్మిలా రెడ్డి. రాష్ట్రంలో చోటు చేసుకున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ తమ పార్టీ ఉద్యమిస్తుందని హెచ్చరించారు.
పార్టీకి పూర్వ వైభవాన్ని తీసుకు వచ్చేందుకు తాను శాయ శక్తులా కృషి చేస్తానని అన్నారు. తనకు పూర్తి సహాయ సహకారాలు అందజేసిన ప్రతి ఒక్కరికీ తాను అభినందనలు తెలియ చేసుకుంటున్నానని చెప్పారు.
ఇక నుంచి తాము ప్రధాన ప్రతిపక్ష పార్టీగా కీలకమైన పాత్ర పోషిస్తుందని అన్నారు వైఎస్ షర్మిలా రెడ్డి. ప్రజలకు అందుబాటులో ఉంటూ ఉద్యమానికి శ్రీకారం చుడతామని చెప్పారు .