జగన్ రెడ్డిపై నిప్పులు చెరిగిన వైఎస్ షర్మిల
కడప జిల్లా – ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆమె తన సోదరుడు, ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై సంచలన ఆరోపణలు చేశారు. తన బాబాయి , దివంగత ఎంపీ వైఎస్ వివేకానంద రెడ్డిని చంపిన అవినాష్ రెడ్డికి తిరిగి ఎంపీ టికెట్ ఎలా ఇస్తారంటూ నిప్పులు చెరిగారు. ఇదేనా నీ నీతి మాలిన , హత్యా రాజకీయం అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
హంతకులను కాపాడటం మంచి పద్దతి కాదన్నారు. ఇది ఏపీ రాజకీయ చరిత్రలో మచ్చ లాగా ఉండి పోతుందని పేర్కొన్నారు వైఎస్ షర్మిలా రెడ్డి. అన్యాయం, అప్రజాస్వామికమని పేర్కొన్నారు. హంతకులు చట్ట సభల్లోకి వస్తే ఎలా అని , దీనిని ప్రజలు గమనించాలని స్పష్టం చేశారు.
అందుకే తాను వైఎస్సార్ బిడ్డగా కడప ఎంపీగా పోటీ చేస్తున్నానని ప్రకటించారు. న్యాయం ఒక వైపు, అధికారం ఒక వైపు. అధర్మం వైపు నిలబడ్డ అవినాష్ రెడ్డి కావాలా? న్యాయం వైపు నిలబడ్డ మీ వైఎస్ షర్మిల కావాలా? ప్రజలు నిర్ణయం తీసుకోవాలని అన్నారు.
హత్యా రాజకీయాలు చేసే అవినాష్ రెడ్డిని, కాపాడే జగన్ రెడ్డిని ఇద్దరినీ ఓడించాలని పిలుపునిచ్చారు.