Friday, April 4, 2025
HomeNEWSANDHRA PRADESHఏపీ బ‌డ్జెట్ అంకెల గార‌డీ

ఏపీ బ‌డ్జెట్ అంకెల గార‌డీ

నిప్పులు చెరిగిన వైఎస్ ష‌ర్మిల‌

అమ‌రావ‌తి – ఏపీ స‌ర్కార్ ప్ర‌వేశ పెట్టిన బ‌డ్జెట్ పై సీరియ‌స్ గా స్పందించారు. ఇది పూర్తిగా అంకెల గార‌డీ అంటూ ఎద్దేవా చేశారు. స‌ర్కార్ తొలి బ‌డ్జెట్ సంఖ్య ఘ‌ణంగా ఉందాని, కేటాయింపులు మాత్రం శూన్య‌మేనంటూ పేర్కొన్నారు. దశ దిశ ప‌స లేని బ‌డ్జెట్ గా అభివ‌ర్ణించారు. రాష్ట్రం గుల్ల బ‌డ్జెట్ అంతా డొల్ల అంటూ మండిప‌డ్డారు. ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా, ఎన్నికల వాగ్దానాలను పూర్తిగా విస్మరించారని ఆరోపించారు. సూపర్ సిక్స్ పథకాలకు పంగనామాలు పెట్టారంటూ ఫైర్ అయ్యారు.
ఇది మంచి ప్రభుత్వం కాదు.. ముంచే ప్రభుత్వం అని తొలి బడ్జెట్‌తోనే నిరూపితం అయ్యిందన్నారు.

సూపర్ సిక్స్ అట్ట‌ర్ ప్లాప్ అంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. అన్నదాత సుఖీభవ పథకానికి కేవలం రూ.6,300 కోట్లు కేటాయించడం దారుణ‌మ‌న్నారు. రాష్ట్రంలో 54 లక్షల మంది రైతులు ఎదురు చూస్తున్నార‌ని వారి ఆశ‌ల‌పై చంద్ర‌బాబు నీళ్లు చ‌ల్లారంటూ వాపోయారు.

రూ.11 వేల కోట్లు నిధులు కావాల్సి ఉంటే..కేంద్రం ఇచ్చే మ్యాచింగ్ గ్రాంట్ కోసం రైతులను నిరీక్షణకు గురి చేయడం అన్యాయమ‌న్నారు. పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక రైతులు అల్లాడుతుంటే ..
ముష్టి రూ.300 కోట్లు ధరల స్థిరీకరణ నిధికి ఇవ్వడం ద్రోహమేన‌ని అన్నారు. తల్లికి వందనం పథకానికి నిధుల్లో కోత పెట్టారన్నారు. రాష్ట్రంలో 84 లక్షల మంది విద్యార్థులకు కావాల్సింది రూ.12,600 కోట్లు అయితే..కేవ‌లం రూ.9,407 కోట్లు మాత్రమే కేటాయించ‌డం స‌ర్కార్ కు ఉన్న చిత్త‌శుద్ది ఏమిటో తేలి పోతుంద‌న్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments