నిప్పులు చెరిగిన వైఎస్ షర్మిల
విజయవాడ – ఏపీపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి నిప్పులు చెరిగారు. సీఎం చంద్రబాబు నాయుడుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరి ప్రయోజనాల కోసం గౌతం అదానీకి మేలు చేకూర్చేలా నిర్ణయాలు తీసుకుంటున్నారంటూ ప్రశ్నించారు. ఇప్పటికే దేశాన్ని, రాష్ట్రాన్ని తన గుప్పిట్లో పెట్టుకున్న అదానీపై ఎందుకంత ప్రేమ అంటూ నిలదీశారు. అంతులేని అవినీతి అక్రమాలకు పాల్పడినట్లు లోకం కోడై కూస్తున్నా ఇంకా ఆధారాలు లభించడం లేదంటూ చెప్పడం దారుణన్నారు.
అదానీపై చర్యలు తీసుకునేందుకు ఎందుకు వెనుకాడుతున్నారో ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. చంద్రబాబు కామెంట్స్ ఈ దశాబ్దపు అతి పెద్ద జోక్ గా అభివర్ణించారు. ఆనాడు ప్రతిపక్షంలో ఉండగా ఏ సమాచారంతో విద్యుత్ ఒప్పందాలపై కోర్టుకి వెళ్ళారని మండిపడ్డారు.
అదానీతో చేసుకున్న ఒప్పందాల్లో అవినీతి దాగి ఉందని ఎందుకు అన్నారని అన్నారు వైఎస్ షర్మిల.
అదానీ పవర్ ఎక్కువ రేటకు కొనడంతో రాష్ట్ర ప్రజలపై లక్ష కోట్ల రూపాయలు భారం పడిందని ఎందుకు చెప్పారంటూ ఫైర్ అయ్యారు. తాడేపల్లి ప్యాలెస్ వేదికగా రాష్ట్రాన్ని అదానీకి దోచి పెడుతున్నారు అని ఎందుకు ఆరోపణలు చేశారు ?ప్రతిపక్షంలో ఉండగా అదానీ మీకు శత్రువు ఇప్పుడు మిత్రుడై పోయారా అని ఎద్దేవా చేశారు.