NEWSANDHRA PRADESH

బీజేపీ అగ్ర‌కుల పార్టీ – వైఎస్ ష‌ర్మిలా రెడ్డి

Share it with your family & friends

మోడీ..అమిత్ షా బ‌హుజ‌నుల‌కు వ్య‌తిరేకం

అమరావ‌తి – ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిలా రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆమె కేంద్ర స‌ర్కార్ ను , ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీని టార్గెట్ చేశారు. ఆయ‌న ప‌దే ప‌దే బీసీన‌ని చెప్పుకుంటార‌ని, కానీ బీసీలంటే ప్రేమ కాద‌ని ఆరోపించారు. భార‌తీయ జ‌న‌తా పార్టీ అగ్ర‌కులానికి చెందిన పార్టీ అని పేర్కొన్నారు.

బీసీల పేరుతో ప‌వ‌ర్ లోకి వ‌చ్చిన మోడీ మాత్ర‌మే ఆనందంగా ఉన్నార‌ని, మిగ‌తా వారు ఆందోళ‌న‌లో ఉన్నార‌ని అన్నారు. బీసీల‌కు ఒరిగింది ఏమీ లేద‌న్నారు. 2017లో బీసీల కులగణన చేస్తాం అని రాజ్ నాథ్ సింగ్ చెప్పారని, మళ్ళీ అధికారంలో వచ్చాక‌ మాట మార్చారని ఆరోపించారు.

కులగణనకు బీజేపీ వ్యతిరేకం అన్నారని మండిప‌డ్డారు. బీజేపీకి బీసీల పట్ల ప్రేమ లేదన్నారు. బీసీలు అంటే అట్టడుగున ఉన్న పేదవాళ్ళు మాత్ర‌మేన‌ని పేర్కొన్నారు వైఎస్ ష‌ర్మిలా రెడ్డి. అదానీ,అంబానీలకు, కార్పొరేట్ వాళ్లకు కొమ్ము గాసే పార్టీ అని ధ్వ‌జ‌మెత్తారు. బీసీలు అంటే మోడీకి ఓట్లు వేసే యంత్రాలు మాత్ర‌మేన‌ని అన్నారు.

రాష్ట్రంలో కూడా చంద్రబాబుకు బీసీల మీద ప్రేమ లేదన్నారు. బీసీల గురించి ఆలోచన చేసిన ఏకైక నాయకుడు వైఎస్ఆర్ మాత్ర‌మేన‌ని అన్నారు. వైఎస్ఆర్ హయాంలో బీసీ జాబితా 143కి పెంచారని చెప్పారు.

వైఎస్ఆర్ బీసీల మనిషి అయితే.. చంద్రబాబు బీసీల ద్రోహి అని ఆరోపించారు. 10 సూత్రాలతో బీసీల మాస్టర్ ప్లాన్ అన్నారు. టీడీపీ బీసీల పార్టీ అన్నారు. 40 ఏళ్ల నుంచి టీడీపీనీ మోస్తుంది బీసీలు అని చెప్పారు. బీసీలకు పెద్ద ఎత్తున నిధులు ఇస్తాం అన్నారు. బీసీలకు ప్రత్యేక రక్షణ చట్టం అని మోసం చేశారు. బీసీలకు 50 ఏళ్లకే పెన్షన్.. పరిశ్రమలకు ప్రోత్సాహం అని కూడా మోసం చేశారని ఆరోపించారు.