నిప్పులు చెరిగిన ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల
అమరావతి – ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల నిప్పులు చెరిగారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేట్ పరం చేసేందుకు కేంద్రంలోని బీజేపీ సర్కార్ కుట్ర చేస్తోందని ఆరోపించారు. మోడీ తన స్నేహితుడు అదానీకి అప్పగించేందుకు లోపాయికారిగా ప్రయత్నం చేస్తున్నారంటూ ధ్వజమెత్తారు. కుట్రకు మోడీ కర్త అయితే ఖర్మ, క్రియ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు అంటూ ఫైర్ అయ్యారు. ఓవైపు ప్రైవేటీకరణ ప్రశ్నే లేదంటారు కానీ మరో వైపు అమ్మే నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదంటూ లిఖిత పూర్వకంగా సమాధానం ఇవ్వడం దారుణమన్నారు వైఎస్ షర్మిలా రెడ్డి.
తను మీడియాతో మాట్లాడారు. విశాఖ ఉక్కుపై కేంద్ర ప్రభుత్వానిది రెండు నాలుకల ధోరణి అని మండిపడ్డారు. పైకి ఆంధ్రుల హక్కుకు గౌరవం ఉందంటూనే మరో వైపు లోపల ప్లాంట్ అమ్మే కుట్రకు మోడీ ఆజ్యం పోస్తూనే ఉన్నారంటూ ఆరోపించారు. రూ.11 వేల కోట్ల ప్యాకేజీ ఇచ్చామంటూనే లోలోపల ప్లాంట్ ప్రాణం తీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖ స్టీల్ పై పీఎం ఫార్ములా “సైలెంట్ కిల్లింగ్ గా ఉందంటూ పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వానిది పచ్చి మోసం అన్నారు. ప్లాంట్ ను ఉద్ధరించామని చెప్పినవన్నీ ఉత్త మాటలేనని పేర్కొన్నారు. అంతా మోసపూరితం. అసత్యపు వాగ్దానాలు తప్పా ఉద్దరించింది ఏమీ లేదన్నారు. విశాఖ ఉక్కుపై ప్రైవేటీకరణ కత్తి ఇంకా వేలాడుతూనే ఉందన్నారు.