NEWSANDHRA PRADESH

జ‌గ‌న్ రెడ్డీ అసెంబ్లీ మీద అలిగితే ఎలా..?

Share it with your family & friends

నిప్పులు చెరిగిన వైఎస్ ష‌ర్మిలా రెడ్డి

విజ‌య‌వాడ – ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిలా రెడ్డి త‌న సోద‌రుడు మాజీ సీఎం జ‌గ‌న్ రెడ్డిని ఏకి పారేశారు. సో మ‌వారం ఆమె మీడియాతో మాట్లాడారు. అత్త మీద కోపం దుత్త మీద చూపించినట్లుంది వైసీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీరు అంటూ ఎద్దేవా చేశారు.

అసెంబ్లీ మీద అలగడానికో.. మైకు ఇస్తేనే పోతానని మారం చేయడానికో కాదు ప్రజలు మీకు ఓట్లేసింది , ఇంట్లో కూర్చొని సొంత మైకుల్లో మాట్లాడేందుకు కాదు మిమ్మల్ని ఎమ్మెల్యేగా గెలిపించింది అని మండిప‌డ్డారు.

మీ స్వయం కృతాపరాధం మిమ్మల్ని ప్రతిపక్ష హోదాకి దూరం చేస్తే…ఆ హోదా ఇస్తేనే అసెంబ్లీలో అడుగు పెడతా అనడం మీ అవివేకానికి, అజ్ఞానానికి నిదర్శనం అంటూ మండిప‌డ్డారు.

అసెంబ్లీ అనేది ప్రజాస్వామ్య దేవాలయం అని, ప్రజల పట్ల, ప్రజా సమస్యల పట్ల అధికార పక్షాన్ని నిలదీసేందుకు ప్రజలు ఇచ్చే గొప్ప అవకాశం అని మ‌రిచి పోతే ఎలా అని ప్ర‌శ్నించారు వైఎస్ ష‌ర్మిలా రెడ్డి.

కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలకు దిక్కులేదు, మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలు అమలుకు నోచు కోవ‌డం లేద‌న్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలుగుతోంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

మహిళలపై దాడులు ఆగడం లేదు. ఇసుక మాఫియా రాజ్యం ఏలుతోందన్నారు. బెల్టు షాపుల దందాను అరికట్టలేదు. 5 నెలలైనా ఒక్క ఉద్యోగం భర్తీ కాలేదని ఆరోపించారు. రోజు రోజుకు నిరుద్యోగం పెరుగుతోందని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.