చంద్రబాబు పాలన బక్వాస్
నిప్పులు చెరిగిన వైఎస్
అమరావతి – ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి నిప్పులు చెరిగారు. ఆరు నెలల పాలన గాడి తప్పిందన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని మండిపడ్డారు. మేనిఫెస్టోలో పెట్టిన 60 హామీల జాడేదని ప్రశ్నించారు. అదానీ, జగన్ ఒప్పందంపై విచారణ ఎందుకు చేపట్టడం లేదంటూ నిలదీశారు. బాబు పాలన్ బక్వాస్ అంటూ ధ్వజమెత్తారు. ప్రజలు మోసపోయామని గ్రహించారని, బుద్ది చెప్పడం ఖాయమన్నారు.
కూటమి సారథ్యంలో చంద్రబాబు నాయుడు అర్ధ సంవత్సర పాలన పూర్తిగా అర్ధ రహితం అంటూ మండిపడ్డారు. 6 నెలల్లో ఇచ్చిన 6 సూపర్ హామీలకు దిక్కు లేదన్నారు. మూడు సిలిండర్లలో ఈ ఏడాది సింగిల్ సిలిండర్ తో మమ అనిపించారంటూ ఎద్దేవా చేశారు.
3 వేల నిరుద్యోగ భృతి ఊసే లేకుండా చేశారని, 20 లక్షల ఉద్యోగాలు అవిగో , ఇవిగో అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు వైఎస్ షర్మిలా రెడ్డి. స్కూల్ కి వెళ్ళే ప్రతి బిడ్డకు 15 వేలు ఇస్తామని తల్లులకు పంగనామాలు పెట్టారని మండిపడ్డారు. రైతుకి 20 వేల సహాయం చేసే పథకం అన్నదాత సుఖీభవను దుఖీః భవ చేశారంటూ ఫైర్ అయ్యారు.
ప్రతి నెల 1500 రూపాయలు ప్రతి ఆడబిడ్డకు ఇస్తా మన్నారు..ఆడబిడ్డ నిధి ఎక్కడో అడ్రెస్ లేకుండా పోయిందన్నారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం ఏమైందంటూ ప్రశ్నించారు. జూన్ 12 న తొలి సంతకం పెట్టిన DSC నోటిఫికేషన్ కే ఇప్పటికీ దిక్కు లేదన్నారు.
“మండలానికి 3 మద్యం షాపులు.. 30 బెల్టు షాపులు. అభివృద్ధిలో 3 మాటలు… 30 గ్రాఫిక్స్ డిజైన్లుష. మొదటి 5 ఏళ్లలో అరచేతిలో వైకుంఠం చూపిస్తే.. ఇప్పుడు మళ్ళీ అదే చేతిలో కైలాసం చూపిస్తున్నారని నిప్పులు చెరిగారు. బాబు షూరిటి భవిష్యత్ గ్యారెంటీ కాస్త ” బాబు షూరిటి… వడ్డింపులకు గ్యారెంటీ ” లా మారిందన్నారు.
వచ్చిన 6 నెలల్లోనే 17500 కోట్ల రూపాయలు జనం నెత్తిన వేశారని వాపోయారు. క్వాలిటీ మద్యం అంటూనే.. ధరలు పెంచి జనాలను పీల్చి పిప్పి చేస్తున్నారని అన్నారు.