బాబూ పిల్లల నుంచి డబ్బులు తీసుకుంటే ఎలా..?
నిప్పులు చెరిగిన ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి
విజయవాడ – ఎవరైనా పిల్లల నుంచి డబ్బులు తీసుకుంటారా..విచిత్రం ఏమిటంటే వరద బాధితుల కోసం ఏపీ ప్రభుత్వం సాయం చేయమని కోరుతోంది. ఇందులో ఎలాంటి తప్పు లేదు. కానీ ఇప్పటికే వేలాది మంది నిరాశ్రయులుగా మారారు తీవ్రమైన వర్షాల కారణంగా. కానీ బాధ్యత కలిగిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇవేవీ పట్టించుకోకుండా పిల్లలు తాము దాచుకున్న డబ్బులను విరాళంగా ఇస్తే తీసుకోవడం దారుణమన్నారు ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి.
విజయవాడలో వరద ప్రభావిత ప్రాంతాలను ఆమె సందర్శించారు. ఈ సందర్బంగా బాధితులను పరామర్శించారు. తమను పట్టించు కోవడం లేదని, తమకు తక్షణమే రూ. 1 లక్ష సాయం చేయాలని కోరారు. ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకు రావాలని కోరారు. దీనిపై సీరియస్ గా స్పందించారు వైఎస్ షర్మిలా రెడ్డి.
ఏపీ ఎంపీల మద్దతుతో కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన మోడీ ప్రభుత్వం ఎందుకు సాయం చేయడం లేదని ప్రశ్నించారు. ముందు చంద్రబాబు చేయాల్సింది పిల్లలతో డబ్బులు అడగడం మానేసి కేంద్రం నుంచి రూ. 10,000 కోట్లు తీసుకు వచ్చేలా చూడాలని డిమాండ్ చేశారు వైఎస్ షర్మిలా రెడ్డి. లేక పోతే బాధితుల తరపున కాంగ్రెస్ పార్టీ ఆందోళన కార్యక్రమం చేపట్టడం ఖాయమని హెచ్చరించారు.