నిప్పులు చెరిగిన ఏపీపీసీసీ చీఫ్ షర్మిల
అమరావతి – రాష్ట్రంలో కూటమి పాలనలో రైతులు ఆగమాగం అయ్యారంటూ ఆవేదన వ్యక్తం చేశారు ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి. లక్షల్లో అప్పులు, రోజుకో బలవన్మరణం పాల్పడుతున్నారని వాపోయారు.. రైతు ఆత్మహత్యల్లో మూడో స్థానం నిలవడం దారుణమన్నారు. ఇది సిగ్గు చేటు అని పేర్కొన్నారు. ప్రభుత్వం మారినా రైతుల తల రాత మారలేదన్నారు. చంద్రబాబు సొల్లు కబుర్లు చెప్పడం తప్పా చేసింది ఏమీ లేదన్నారు. ఆరుగాలం శ్రమించి పండించిన పంటలకు గిట్టుబాటు ధర దక్కడం లేదన్నారు.
శనివారం వైఎస్ షర్మిల మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో రైతులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు చేపట్టలేదన్నారు. ఓ వైపు ఆత్మహత్యలకు పాల్పడుతున్నా ఇప్పటి వరకు సీఎం ఎందుకు స్పందించ లేదంటూ ప్రశ్నించారు. డిప్యూటీ సీఎం ఏం చేస్తున్నారంటూ నిలదీశారు.
కాంగ్రెస్ పాలనలో మహానేత YSR సీఎంగా ఉన్నప్పుడు అన్నపూర్ణగా పేరొందిన ఏపీ ఇప్పుడు తీవ్ర నష్టాల్లోకి ఎలా కూరుకు పోయిందంటూ మండిపడ్డారు. మిర్చి రైతు విలవిలాడుతుంటే.. కంది రైతు కంట కన్నీరు పెడుతున్నారని ఆరోపించారు. కూరగాయల ధరలకు మార్కెట్ లో రెక్కలొస్తున్నా ప్రశ్నించడం లేదన్నారు.