Saturday, May 24, 2025
HomeNEWSANDHRA PRADESHఏపీలోనే పెట్రోల్..డీజిల్ ధ‌ర‌లు ఎక్కువ‌

ఏపీలోనే పెట్రోల్..డీజిల్ ధ‌ర‌లు ఎక్కువ‌

త‌గ్గించాల‌ని వైఎస్ ష‌ర్మిలా రెడ్డి డిమాండ్

విజ‌య‌వాడ – ఏపీలో డీజిల్, పెట్రోల్ ధ‌ర‌లు త‌డిసి మోప‌డ‌వుతున్నాయ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు ఏఐసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిలా రెడ్డి. రాష్ట్రంలో ఇవ్వాళ పెట్రోల్ ధర రూ. 109.60 పైసలు. డీజిల్ ధర రూ 97.47 పైసలు ఉంద‌న్నారు. పక్కనున్న తమిళనాడు రాష్ట్రంలో లీటరు పెట్రోల్ ధర రూ.100.86 పైసలు. డీజిల్ ధర రూ.92.39 పైసలు అమ్ముతున్నార‌ని పేర్కొన్నారు. తమిళనాడుతో పోల్చితే మన దగ్గర పెట్రోల్ మీద 9 రూపాయలు, డీజిల్ మీద 5 రూపాయలు ఎక్కువగా ఉందన్నారు. కర్ణాటకలో లీటరు పెట్రోల్ ధర రూ.102.90 పైసలు. డీజిల్ ధర రూ.88.99 పైసలు ఉంద‌ని, కర్ణాటకతో పోల్చితే ఏపీలో పెట్రోల్ మీద లీటరుకు 7 రూపాయలు, డీజిల్ మీద 9 రూపాయలు ఎక్కువగా ఉంద‌ని చంద్ర‌బాబు ఏం చేస్తున్నారంటూ మండిప‌డ్డారు.

పక్కనున్న తెలంగాణలో లీటరు పెట్రోల్ ధర. రూ 107.46పైసలు. డీజిల్ ధర రూ. 95.70పైసలుగా ఉంద‌న్నారు వైఎస్ ష‌ర్మిలా రెడ్డి. తెలంగాణతో పోల్చినా ఏపీలో లీటరు మీద 3 రూపాయలు అదనంగా ఉంద‌న్నారు. పన్నులు ఘనం.. అభివృద్ధి శూన్యం ఇది రాష్ట్ర పరిస్థితిని తెలియ చేస్తుంద‌న్నారు. పెట్రోల్, డీజిల్ మీద పన్నులు తగ్గింపుపై టీడీపీ, వైసీపీ పార్టీలవి నీచ రాజకీయాలంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. ప్రతిపక్షంలో ఒక మాట.. అధికార పక్షంలో మరో మాట మాట్లాడ‌టం దారుణం అన్నారు. గత 10 ఏళ్లుగా రెండు పార్టీల ప్రభుత్వాలు చేసింది దారి దోపిడీ తప్పా మరోకటి కాదన్నారు.
వ్యాట్ పేరుతో ఏ రాష్ట్రంలో లేనంతగా ప్రజలపై పన్ను పోటు విధించారన్నారు వైఎస్ ష‌ర్మిలా రెడ్డి.

RELATED ARTICLES

Most Popular

Recent Comments