టీడీపీ ప్రభుత్వం బేకార్ అంటూ ఫైర్
అమరావతి – ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి నిప్పులు చెరిగారు. బుధవారం ఆమె తాడేపల్లి గూడెం నియజకవర్గాన్ని పర్యటించారు. భారీ ఎత్తున కురుస్తున్న వర్షాలకు పెద్ద ఎత్తున పంటలు కోల్పోయారు. ఎక్కడ చూసినా నీళ్లే అగుపిస్తున్నాయి. ఈ సందర్బంగా రైతులకు భరోసా కల్పించేందుకు ప్రయత్నం చేశారు.
వర్షాల కారణంగా దెబ్బతిన్న పంటలను చూసి ఆమె తీవ్ర ఆవేదనకు గురయ్యారు. రైతుల ఘోషను చూసి కన్నీటి పర్యంతం అయ్యారు. వారిని చూస్తే తన గుండె బరువైందని పేర్కొన్నారు. రాష్ట్రంలో అసలు ప్రభుత్వం అనేది ఉందా అన్న అనుమానం కలుగుతోందన్నారు.
ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి నీళ్లల్లోంచే మీడియాతో మాట్లాడారు. ఈ సర్కార్ బేకార్ అంటూ ఫైర్ అయ్యారు. భారీ వర్షాలు కురుస్తున్నప్పటికీ సహాయ చర్యలు చేపట్టడంలో విఫలం కావడం దారుణమన్నారు.
ఎంత సేపు ఆరోపణలు చేయడం తప్ప చేసింది ఏముందంటూ ప్రశ్నించారు. ఇటు విపత్తు నిర్వహణ నిధుల విషయంలో కేంద్ర సర్కార్ సవతి తల్లి ప్రేమను చూపుతోందంటూ మండిపడ్డారు వైఎస్ షర్మిలా రెడ్డి. తాను నదిలో దిగడమే కాదు పర్వతాలు కదిలించడానికి కూడా కాంగ్రెస్ అన్నదాతల కోసం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కేంద్ర, రాష్ట్ర సర్కార్లను హెచ్చరించారు.