NEWSANDHRA PRADESH

కేంద్రం నిర్వాకం ష‌ర్మిల ఆగ్ర‌హం

Share it with your family & friends

ఏపీపై మోడీ స‌వ‌తిత‌ల్లి ప్రేమ

విజ‌య‌వాడ – ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిలా రెడ్డి నిప్పులు చెరిగారు. కేంద్ర ప్ర‌భుత్వంపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు . మంగ‌ళ‌వారం విజయవాడ లోని పాత రాజరాజేశ్వరి పేటలో వరద బాధితులను పరామర్శించారు. అనంత‌రం వైఎస్ ష‌ర్మిలా రెడ్డి మీడియాతో మాట్లాడారు.

బుడమేరు వరదపై టీడీపీ-వైసీపీ బురద రాజకీయాలు చేస్తున్నాయ‌ని ఆరోపించారు. వైఎస్ఆర్ మరణం తర్వాత బుడమేరును పట్టించుకున్న వాళ్ళు లేరన్నారు. . బుడమేరు వరదకు చంద్ర‌బాబు నాయుడు, జ‌గ‌న్ రెడ్డి కార‌ణ‌మ‌ని ఆరోపించారు.

వరదల్లో ఇప్పటివరకు 50 మంది చనిపోయారని, దాదాపు 7లక్షల మంది నిరాశ్రయులయ్యార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. వరదల కార‌ణంగా దాదాపు రూ.6800 కోట్లు నష్టం జరిగిందని సీఎం చంద్రబాబు చెప్పారని ఇప్ప‌టి వ‌ర‌కు కేంద్రం నుంచి ఒక్క పైసా కూడా రాలేద‌న్నారు.

ఆంధ్ర మీద కేంద్రం స‌వ‌తి త‌ల్లి ప్రేమ‌ను చూపిస్తోంద‌ని ధ్వ‌జ‌మెత్తారు వైఎస్ ష‌ర్మిలా రెడ్డి. ఆంధ్ర ఎంపీలతో అధికారం అనుభవిస్తున్న మోదీ ఇంత పెద్ద ఎత్తున న‌ష్టం జ‌రిగితే క‌నీసం ప‌రామ‌ర్శించేందుకు రాలేద‌ని మండిప‌డ్డారు.

ఇక ఏటా విజయవాడ డివిజన్ నుంచి రూ.6వేల కోట్ల ఆదాయం వస్తుందని, రైల్ నీరు ప్లాంట్ విశాఖలోనే ఉంది. కానీ రైల్వే శాఖ ఒక బాటిల్ కూడా సాయం చేయలేదని ఆరోపించారు.

మంచినీళ్ళు ఇవ్వమని తాను స్వయంగా కేంద్ర రైల్వేశాఖ మంత్రికి లేఖ రాశా. అయినా కనీస స్పందన లేదన్నార‌ను.

వరద వల్ల నష్టపోయిన ప్రతి ఇంటికి కనీసం లక్ష రూపాయల సహాయం చేయాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు చిన్న పిల్లల దగ్గర డబ్బులు తీసుకోవడం విడ్డూరంగా ఉంద‌న్నారు.