తండ్రికి తగ్గ తనయుడు కాదు
అన్నపై సోదరి షర్మిల ఫైర్
అమరావతి – ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి నిప్పులు చెరిగారు. ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఏకి పారేశారు. ఒక రకంగా ఊహించని రీతిలో దారుణమైన రీతిలో కామెంట్స్ చేశారు. దివంగత సీఎం , తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి బాటలో పయనించాల్సిన తన సోదరుడు పట్టించు కోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
రాజశేఖర్ రెడ్డి 75వ జయంతి రోజున జగన్ ఏమి చేశారు? ఇడుపులపాయలో వైఎస్ఆర్ ఘాట్ వద్ద కనీసం అరగంట సేపు కూడా ఉండలేక పోయారని, కేవలం ఐదు నిముషాలు మాత్రమే ఉన్నారని వాపోయారు. వందల కోట్లు సిద్ధం సభలకు ఖర్చు పెట్టిన మీరు వైఎస్ఆర్ జయంతికి ఏం చేశారో ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత జగన్ మోహన్ రెడ్డిపై ఉందన్నారు.
కొడుకుగా ఘనమైన వారసత్వాన్ని నెలకొల్పాల్సిన నువ్వు కనీసం ఒక సభను కూడా పెట్టలేక పోవడం బాధాకరమన్నారు. ఈ మాత్రమైనా సోయి అన్నది లేక పోవడం దారుణమన్నారు వైఎస్ షర్మిలా రెడ్డి. వైసీపీ నేతలు, కార్యకర్తలు ఇప్పుడు ఏమై పోయారంటూ మండిపడ్డారు.