ఏ పార్టీకి ఓటేసినా బీజేపీకి వేసినట్టే
ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి
మడకశిర – ఏపీలో ఏ పార్టీకి ఓటు వేసినా అది భారతీయ జనతా పార్టీకి ఓటు వేసినట్టేనని ధ్వజమెత్తారు ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి. ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం మడకశిర నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్బంగా జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు.
హంద్రీనీవా ప్రాజెక్టు వైఎస్ఆర్ హయంలో 90 శాతం పూర్తి అయ్యిందన్నారు. 2019 ఎన్నికలో బాబు కట్టలేదని జగన్ ఎద్దేవా చేశాడన్నారు. అధికారంలో వస్తె ప్రాజెక్ట్ పూర్తి చేసి 127 చెరువులకు నీళ్ళు ఇస్తా అన్నారని దానిని మరిచి పోయాడని మండిపడ్డారు.
లక్షల ఎకరాలకు సాగునీరు ఇస్తామన్నారని, పవర్ లోకి వచ్చాక దాని ఊసే లేదన్నారు వైఎస్ షర్మిలా రెడ్డి. ఇండస్ట్రియల్ కారిడార్ అన్నాడని ఒక్క కంపెనీ రాలేదన్నారు. ఆనాటి మంత్రి రఘువీరా రెడ్డి హయాంలోనే భూ సేకరణ జరిగిందని చెప్పారు.
భూములు ఉన్నా పరిశ్రమలు రాలేదన్నారు. లెదర్ పార్కు అన్నాడని కానీ దాని గురించి కూడా మాట్లాడటం మానేశాడని మండిపడ్డారు. మడక శిర నియోజక వర్గం చుట్టూ రింగ్ రోడ్ అన్నారని దాని ఊసే ఎత్తడం లేదన్నారు.
గత పది ఏళ్లుగా ఈ నియోజకవర్గాన్ని టీడీపీ, వైసీపీ మోసం చేసిందన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా వచ్చి ఉంటే రాష్ట్ర ప్రగతి మరోలాగా ఉండేదన్నారు వైఎస్ షర్మిల. బాబు పొత్తు జగన్ తొత్తు అంటూ ఎద్దేవా చేశారు.