గొడ్డలి రాజకీయాలు రావు
ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల
కడప జిల్లా – ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కడప ఎంపీగా బరిలో ఉన్న ఆమె సోమవారం మీడియాతో మాట్లాడారు. కన్న తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పట్ల తనయుడైన జగన్ రెడ్డి కావాలని సీబీఐ ఛార్జిషీట్ లో పేరు నమోదు చేయించాడని ఆరోపించారు. ఇదేనా తండ్రికి కొడుకు ఇచ్చే గౌరవం అని ప్రశ్నించారు.
అంతే కాదు ఛార్జిషీట్ లో పేరు నమోదు చేసినందుకు గాను ఏకంగా అత్యున్నతమైన పదవిని కట్టబెట్టిన ఘనత జగన్ రెడ్డికే దక్కుతుందన్నారు. ఆ పదవి దక్కించుకున్నది ఎవరో కాదు పొన్నవోలు సుధాకర్ రెడ్డి అని పేర్కొన్నారు వైఎస్ షర్మిల.
జగన్ రెడ్డి భారీ గిఫ్ట్ ఇచ్చారని, అడిషనల్ ఏజీగా ఛాన్స్ ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. సీబీఐ విచారణ కావాలని అధికారంలో లేనప్పుడు అడిగారని, కానీ అధికారంలోకి రాగానే వద్దన్నారని .. సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
తాను రూ. 1,000 కోట్లు తీసుకున్నానంటూ రాఘవ రెడ్డి చేసిన ఆరోపణలు అవాస్తవమని అన్నారు. ఎక్కడ తీసుకున్నానో బయట పెట్టాలని డిమాండ్ చేశారు. తన భర్త అనిల్ కుమార్ బీజేపీ నేతలను ఎక్కడా కలవలేదన్నారు.