అపార నష్టం స్పందించని కేంద్రం – షర్మిల
ఏపీ పీసీసీ చీఫ్ షాకింగ్ కామెంట్స్
విజయవాడ – ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి సీరియస్ కామెంట్స్ చేశారు. మంగళవారం ఆమె వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించారు. బాధితులతో మాట్లాడారు. తమకు సాయం ఇంకా అందలేదని వాపోయారు.
అనంతరం మీడియాతో మాట్లాడారు వైఎస్ షర్మిలా రెడ్డి. కేంద్ర ప్రభుత్వం సొల్లు కబుర్లు చెప్పడం తప్పితే ఇప్పటి వరకు ఎలాంటి సాయం చేయలేదని మండిపడ్డారు . ఇది ఎంత మాత్రం మంచిది కాదన్నారు.
భారీ ఎత్తున కురిసిన వర్షాల కారణంగా ఏపీ దిక్కులేనిదిగా మారి పోయిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు వైఎస్ షర్మిలా రెడ్డి.
అపారమైన ప్రాణ, ఆస్తి నష్టం జరిగిందన్నారు, విజయవాడ అరుదైన విపత్తులను ఎదుర్కొంటోందని పేర్కొన్నారు.
అయినా కేంద్రం ఏపీ రాష్ట్రానికి ఇప్పటి వరకు పైసా విదల్చలేదని ధ్వజమెత్తారు వైఎస్ షర్మిలా రెడ్డి. . విజయవాడలో కనీసం 7 లక్షల మంది ఈ వరదల వల్ల నిరాశ్రయులుగా మారారని వాపోయారు. బీజేపీ, జనసేన పార్టీలతో పాటు టీడీపీ కూటమి ఉన్నప్పటికీ ఎందుకని మోడీ స్పందంచ లేదని ప్రశ్నించారు .