మోదీ ప్రత్యేక హోదా ఏమైంది
నిప్పులు చెరిగిన వైఎస్ షర్మిల
తిరుపతి – ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని ఏకి పారేశారు. గతంలో ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని ప్రకటించిన పీఎం ఇప్పుడు ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు.
తిరుపతిలో ఆదివారం కాంగ్రెస్ పార్టీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి వైఎస్ షర్మిలా రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఇచ్చిన మాట ఏమైందని మోదీని ప్రజలు అడుగుతున్నారని, దీనిపై ఎందుకు బీజేపీ అడగడం లేదని నిలదీశారు.
మాట నిలబెట్టుకోలేని మోదీ మీరు కేడీనే అవుతారంటూ ఎద్దేవా చేశారు. ఆంధ్ర ప్రజలకు మోదీ చేసింది పాపం , అన్యాయం తప్ప ఏమీ లేదన్నారు. బీజేపీ కేడీల పార్టీ అని, ఆ పార్టీకి మద్దతు ఇస్తున్న చంద్రబాబు నాయుడు, జగన్ మోహన్ రెడ్డిలకు ప్రజలు తగిన రీతిలో బుద్ది చెప్పడం ఖాయమని జోష్యం చెప్పారు.
రాష్ట్రంలో పాలన వ్యవస్థగా మారిందని పేర్కొన్నారు. ప్రజలను మోసం చేసిన చంద్రబాబు, జగన్ ను ప్రజలను నమ్మే పరిస్థితి లేదన్నారు వైఎస్ షర్మిలా రెడ్డి.