ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి కామెంట్
అహ్మదాబాద్ – ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి ఎంతో అవసరం అని అన్నారు. ఇంకా పార్టీ బలపడాల్సిన అవసవరం ఉందన్నారు. వక్ఫ్ బిల్లును బీజేపీ దౌర్జన్యంగా ఆమోదించిందని ఆరోపించారు. మైనారిటీల మనోభావాలు బీజేపీ దెబ్బ తీసిందని వాపోయారు. ప్రజల మధ్య మత రాజకీయాలు చేస్తోందంటూ మండిపడ్డారు. ఆ పార్టీకి తెలిసిందల్లా విభజించు పాలించు అన్నది మాత్రమేనని పేర్కొన్నారు వైఎస్ షర్మిలా రెడ్డి. కాంగ్రెస్ నాటిన చెట్ల ఫలాలను బీజేపీ దుర్వినియోగం చేస్తున్నదని ఆవేదన చెందారు. ఏపీలో పార్టీ బలోపేతం కోసం సోనియా, రాహుల్ ను ఆహ్వానించామన్నారు.
మతం పేరుతో, కులం పేరుతో ప్రజలను చీల్చడమే పనిగా పెట్టుకుందన్నారు. మతం పేరుతో మంటలు పెట్టీ ఆ మంటల్లో చలి కాచుకుంటుందోన్నారు. ఈ దేశంలో అన్ని వ్యవస్థలను బీజేపీ సొంత అవసరాలకు వాడుకుంటుందోని ఆరోపించారు. చివరికి ఎన్నికల సంఘాన్ని సొంతంగా నడిపిస్తోందన్నారు. ఈ దేశ సంపదను అదానీ, అంబానీ కి దోచి పెడుతుందని ధ్వజమెత్తారు ఏపీపీసీసీ చీఫ్. బీజేపీ దోపిడి అరికట్టాలి అంటే కాంగ్రెస్ అధికారంలో రావాల్సిన అవసరం ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన పార్టీ. దేశ ప్రజల సంక్షేమం కాంగ్రెస్ కున్న చిత్తశుద్ధి ఏపాటిదో అర్థం అవుతుందన్నారు.