జగన్ పారి పోకుండా చూడాలి
ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల
కడప జిల్లా – ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి తన సోదరుడు, వైసీపీ బాస్ , ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై సంచలన ఆరోపణలు చేశారు. ఆమె బుధవారం మీడియాతో మాట్లాడారు. జగన్ రెడ్డి ఈసారి ఓడి పోతున్నాడని జోష్యం చెప్పారు . అంతే కాకుండా విదేశాలకు పారి పోయేందుకు పాస్ పోర్టులు కూడా సిద్దం చేసుకుంటున్నాడని ఆరోపించారు వైఎస్ షర్మిలా రెడ్డి.
ఆయనతో పాటు ఎంపీ అవినాష్ రెడ్డి కూడా దొంగ పాస్ పోర్ట్ తయారు చేసుకున్నాడని మండిపడ్డారు. తన చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డిని చంపిన కేసులో ప్రధాన ముద్దాయిగా ఉన్నాడని, కానీ అతడికి ఏరికోరి ఈసారి ఎన్నికల్లో తిరిగి ఎంపీ టికెట్ ఎందుకు ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు.
ఎన్నికలకు సంబంధించి ఫలితాలు వెల్లడి అయ్యే రోజును జగన్ రెడ్డి కుటుంబం దేశం విడిచి పారి పోకుండా చూడాలని, ఇందుకు కేంద్రం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గొడ్డలితో అందరినీ నరకాలనేది భారతీ రెడ్డి వ్యూహం అని మండిపడ్డారు. గొడ్డలితో మిగతా వారిని కూడా నరికేయండి..అప్పుడు మీరే సింగిల్ ప్లేయర్ గా ఉంటారంటూ ఎద్దేవా చేశారు వైఎస్ షర్మిలా రెడ్డి.