చంద్రబాబూ అదానీపై మౌనమేల..?
నిప్పులు చెరిగిన వైఎస్ షర్మిల
అమరావతి – ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడును ఏకి పారేశారు. అదానీ వ్యవహారంపై ఎందుకు మౌనంగా ఉన్నారో చెప్పాలని అన్నారు. జగన్ , అదానీ ఒప్పందంపై విచారణకు ఎందుకు ఆదేశించడం లేదని ప్రశ్నించారు. ఎవరి ప్రయోజనాలను కాపాడేందుకు ప్రయత్నం చేస్తున్నారంటూ నిలదీశారు. దమ్ముంటే కేంద్ర దర్యాప్తు సంస్థతో విచారణ చేపట్టాలన్నారు.
జగన్ తప్పు చేస్తే సెకీ ఒప్పందాన్ని ఎందుకు రద్దు చేయలేదో చెప్పాలంటున్న విజయసాయి రెడ్డి వ్యాఖ్యలకు చంద్రబాబు ఏమంటారంటూ ఫైర్ అయ్యారు వైఎస్ షర్మిల. మౌనంగా ఉంటున్నారు అంటే అదానీ ఒప్పందం అక్రమం కాదని ఒప్పుకున్నారా? సక్రమం కాబట్టే రద్దు చేయలేదని చెప్పకనే చెప్తున్నారా అని ఫైర్ అయ్యారు.
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాజకీయం తప్ప.. మీ ఆరోపణల్లో నిజం లేదంటారా? పోనీ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది కూడా అంత తూచ్ కిందనేనా? అదానీ జగన్‌నే కాదు.. మిమ్మల్ని కూడా కొన్నారని చెప్తారా? ముడుపులు వాళ్లకేనా.. మీకు అందాయనే నిజం అంగీకరిస్తున్నారా? ఇదేనా బాబు మీ 40 ఏళ్ల రాజకీయం అంటూ నిప్పులు చెరిగారు.
ఇప్పటికైనా డీల్ రద్దు చేసి రూ.1750 కోట్ల ముడుపులపై దర్యాప్తునకు ఆదేశాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నామన్నారు వైఎస్ షర్మిలా రెడ్డి.