ఎమ్మెల్యేకు షాకిచ్చిన ఓటర్ బెటర్
నిప్పులు చెరిగిన వైఎస్ షర్మిల
కడప జిల్లా – ఏపీ పీసీసీ చీఫ్ , కడప లోక్ సభ స్థానం అభ్యర్థి వైఎస్ షర్మిలా రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. గుంటూరు జిల్లా తెనాలిలో పోలింగ్ సందర్భంగా వైసీపీ ఎమ్మెల్యే శివకుమార్ ప్రవర్తించిన తీరు పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో ఇది ఎంత మాత్రం మంచి పద్దతి కాదని పేర్కొన్నారు.
అధికారం ఉంది కదా అని మదమెక్కి ప్రవర్తిస్తే ప్రజలు చూస్తూ ఊరుకోరని, ఈ విషయం పూర్తిగా అధికార పార్టీ నేతలకు అర్థమై ఉంటుందని స్పష్టం చేశారు వైఎస్ షర్మిల. చిల్లర రాజకీయాలు చేస్తూ, రాచరిక పాలన సాగిస్తున్న జగన్ రెడ్డికి చుక్కలు చూపించడం ఖాయమని పేర్కొన్నారు.
ఇలాంటి వాళ్లను వెంటనే ఎన్నికలలో పోటీ చేయకుండా ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే అయినంత మాత్రాన వారికి ప్రత్యేకంగా వసతులు అంటూ ఉండవని, పోలింగ్ సమయంలో ఎవరైనా క్యూలో నిలబడి ఓటు వేయాల్సిందేనని స్పష్టం చేశారు వైఎస్ షర్మిల.
అహంకారం, అరాచకం సృష్టించే రౌడీ మూకలకు ప్రజలు ఎప్పుడూ బుద్ధి చెబుతారని గుర్తు పెట్టుకోవాలని అన్నారు, ఎటొచ్చి ఓటుతో కాకుండా చెప్పులతో, చెంప చెళ్ళుమనేటట్లు చేసుకుంటున్నందుకు వైసీపీ వాళ్ళు సిగ్గుపడాలని అన్నారు.