సాయం అడిగే స్థితిలో లేను
కోట్లకు ఆస్తిపరురాలిని
అమరావతి – ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను సాయం అడిగే స్థితిలో లేనని స్పష్టం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా తనపై వైసీపీ నేతలు ఆరోపణలు చేయడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు.
తాను రూ. 1,000 కోట్లు పని అడిగానని చెప్పడం తప్పుడు ప్రచారం చేయడంపై మండిపడ్డారు. ఇలా మాట్లాడే వాళ్లు, నాపై ఆరోపణలు చేసే వాళ్లు జగన్ పడేసే కుక్క బిస్కెట్లకు ఆశ పడే వాళ్లేనంటూ ధ్వజమెత్తారు.
ముందు తనపై ఇలా ఆరోపణలు చేసే వాళ్లు మీకు ఎంత అందుతున్నాయో చెప్పాలని ఆమె నిలదీశారు. వెయ్యి ఏంటీ.. రూ. 10 వేల కోట్లు వర్క్ అడిగానని చెబుతారంటూ ప్రశ్నించారు. ఇప్పటి వరకు తాను ఎవరికీ తలవంచ లేదన్నారు. ఒక్క పైసా సాయం అడగ లేదని స్పష్టం చేశారు వైఎస్ షర్మిలా రెడ్డి.
వైసీపీ నేతలంతా ఊసర వెల్లులంటూ ఎద్దేవా చేశారు. అవసరానికి వాడుకోవడం, ఆ తర్వాత వదిలి వేయడం మీకే చెల్లుతుందన్నారు ఏపీ పీసీసీ చీఫ్. కన్న తల్లి విజయమ్మపై సైతం నిందలు వేయడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు.