NEWSANDHRA PRADESH

జ‌గ‌న్ పాల‌న అస్త‌వ్య‌స్తం

Share it with your family & friends

నిప్పులు చెరిగిన ష‌ర్మిల

అమ‌రావ‌తి – ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిల నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో వైసీపీ పాల‌న గాడి త‌ప్పింద‌న్నారు. పాడేరులో జ‌రిగిన బ‌హిరంగ స‌భ‌లో ఆమె పాల్గొని ప్ర‌సంగించారు. పాడేరు ప్రాంత‌మ‌న్నా, ఆది వాసీల‌న్నా దివంగ‌త వైఎస్సార్ కు ఎంతో అభిమాన‌మ‌ని పేర్కొన్నారు.

వైయ‌స్ఆర్ హయాంలో 20 లక్షల ఎకరాలకు పోడు పట్టాలు ఇచ్చారని గుర్తు చేశారు. రోడ్లు, కాలేజీలు, ఆసుపత్రులు అన్ని ఆయన కట్టించారని చెప్పారు.వైయ‌స్ఆర్ వేసిన రోడ్లే ఈరోజు వ‌ర‌కు ఉన్నాయ‌ని , కానీ ఇప్ప‌టి వ‌ర‌కు జ‌గ‌న్ రెడ్డి స‌ర్కార్ ఏర్పాటు చేయ‌క పోవ‌డం విడ్డూరంగా ఉంద‌న్నారు.

గిరిజనుల అభివృద్ధిపై ఏ మాత్రం శ్ర‌ద్ధ లేద‌ని ఆరోపించారు . సరైన రోడ్లు లేక గర్భిణులు చనిపోతున్నారని ఆవేద‌న చెందారు. ఈ ప్రాంతంలో ఇప్పటికీ కనీసం త్రాగు నీటి సౌకర్యం లేదన్నారు.
ఈ ప్రభుత్వానికి ఆదివాసీలపై చిత్తశుద్ధి ఏంటనేది అర్థం అవుతుంద‌న్నారు.

ఈ ప్రాంతం బాగు పడాలన్నా ఆదివాసీల‌ జీవన స్థితిగతులు మారాలన్నా కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమ‌వుతుంద‌ని అన్నారు వైఎస్ ష‌ర్మిలా రెడ్డి. అందుకే ఆలోచించి ఓటు వెయ్యండి .. మీ కోసం నిరంతరం శ్రమిస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు వంతల సుబ్బారావు గారిని గెలిపించండని కోరారు.