విశాఖ రాజధాని పేరుతో మోసం
ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి
అమరావతి – ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో నిప్పులు చెరిగారు ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి. బుధవారం ట్విట్టర్ వేదికగా తీవ్రంగా స్పందించారు. నిన్నటి దాకా మూడు రాజధానులు అంటూ ప్రజల చెవుల్లో పూలు పెట్టారంటూ మండిపడ్డారు. ఇప్పుడు మరో కొత్త నినాదంతో మోసం చేసేందుకు ముందుకు వచ్చారంటూ తన సోదరుడిని ఏకి పారేశారు సోదరి వైఎస్ షర్మిలా రెడ్డి.
విశాఖ నుంచి పరిపాలన సాగిస్తానంటూ చెప్పడం దారుణమన్నారు. ప్రజలు నమ్మి మీకు ఓట్లేస్తే ఇన్నేళ్ల కాలం ఏం పని చేశారంటూ ప్రశ్నించారు . పరిపాలన రాజధానిలో ఇన్నాళ్లు పాలన మొదలు పెట్టేందుకు ఏం అడ్డం వచ్చిందంటూ నిలదీశారు వైఎస్ షర్మిలా రెడ్డి.
కొత్తగా పరిపాలన రాజధాని అంటూ చీటింగ్ చేశారంటూ ఫైర్ అయ్యారు. గత మూడేళ్లుగా ఇదే నినాదంతో ముందుకు వెళ్లడం సిగ్గు అనిపించడం లేదా అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. విశాఖకు పెద్ద ఎత్తున కంపెనీలు తిరిగి వెళ్లి పోవడానికి మీరే బాధ్యత వహించాలంటూ జగన్ పై మండిపడ్డారు.
ఓ వైపు కేంద్రానికి తల వంచిన మీరు విశాఖ స్టీల్ ఫ్యాక్టరీని ప్రైవేట్ పరం చేసేందుకు ప్రయత్నం చేస్తుంటే ఏం చేస్తున్నారంటూ నిప్పులు చెరిగారు వైఎస్ షర్మిలా రెడ్డి. ఇప్పటి దాకా రైల్వే జోన్ పట్టాలు ఎక్కక పోవడానికి ప్రధాన కారణం మీరేనంటూ స్పష్టం చేశారు.