ఓట్లు వేసింది హత్యలు చేసేందుకా
నిప్పులు చెరిగిన ఏపీ పీసీసీ చీఫ్
అమరావతి – ఏపీ సీఎం జగన్ రెడ్డిపై మండిపడ్డారు ఏపీ పీసీసీ చీఫ్ షర్మిలా రెడ్డి. హత్యా రాజకీయాలను పెంచి పోషించడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు. ప్రజలు ఏరికోరి ఏదో చేస్తావని ఓట్లు వేసి గెలిపిస్తే చివరకు మర్డర్లు చేయడం పనిగా పెట్టుకోవడం దారుణమన్నారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏపీ పీసీసీ బస్సు న్యాయ యాత్ర చేపట్టారు. ఈ సందర్బంగా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు వైఎస్ షర్మిలా రెడ్డి. విచిత్రం ఏమిటంటే ఎవరైతే హత్యలు చేశారో వారినే ఏరికోరి ఎంపిక చేసి వైసీపీ టికెట్లు ఇచ్చిందంటూ ధ్వజమెత్తారు.
తెలంగాణలో నా పనై పోయిందన్నారు. తాను ఒకే ఒక్క లక్ష్యంతో పని చేశానని చెప్పారు. కేసీఆర్ ను దించాలని అనుకున్నానని అది కూడా తీరిందన్నారు. ప్రస్తుతం తమ పార్టీ పవర్ లోకి వచ్చిందన్నారు. ఇక్కడ కూడా కాంగ్రెస్ జెండా ఎగుర వేయాలన్నదే తన అభిమతం అన్నారు.
తమ చిన్నాయిన మాజీ ఎంపీ , దివంగత ఎంపీ వివేకానంద రెడ్డిని దారుణంగా హత్య చేసిన వాళ్లు స్వేచ్చగా తిరుగుతున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు వైఎస్ షర్మిలా రెడ్డి. ఇకనైనా ప్రజలు గమనించి తనను ఎన్నుకోవాలని ఆమె కోరారు.