ప్రపంచం చూపు కడప వైపు
ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల
కడప జిల్లా – యావత్ ప్రపంచంలోని తెలుగు సమాజం అంతా ఏపీలోని కడప వైపు చూస్తోందని అన్నారు ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం పులివెందుల నియోజకవర్గంలో పర్యటించారు. భారీ ఎత్తున జనం హాజరయ్యారు. చెల్లెలు డాక్టర్ సునీతా రెడ్డి కూడా హాజరయ్యారు.
కడప లోక్ సభ స్థానంలో న్యాయం గెలుస్తుందా లేక నేరం విజయం సాధిస్తుందా అన్న చర్చ పెద్ద ఎత్తున జరుగుతోందన్నారు. ఓ వైపు వైఎస్ఆర్ బిడ్డ బరిలో ఉందన్నారు. ఇంకో వైపు తన చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డిని దారుణంగా హత్య చేసిన కేసులో తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డి పోటీలో ఉన్నారని జనం ఎవరి వైపు ఉంటారో చూడాలన్నారు.
ఇప్పటి దాకా ఎంపీగా ఉన్న అవినాష్ రెడ్డి కడప ప్రాంతానికి ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు వైఎస్ షర్మిలా రెడ్డి. కడప స్టీల్ కోసం ఒక్క ఉద్యమమైనా చేశారా అని ప్రశ్నించారు. ఆయన ఎంపీగా ఉన్నది కేవలం ప్రత్యర్థులపై దాడులు చేసేందుకు, హత్యలు చేయించడం కోసమే ఉన్నారంటూ ఆరోపణలు చేశారు. వివేకాకు కొడుకులు లేరని , జగన్ రెడ్డిని కొడుకు లాగా చూసుకున్నారని అన్నారు.