అన్నా అభాండాలు వేస్తే ఎలా..?
జగన్ రెడ్డిపై షర్మిలా రెడ్డి ఫైర్
కడప జిల్లా – ఏపీ సీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి నిప్పులు చెరిగారు. సోదరుడు , వైసీపీ బాస్ , ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పై ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై లేనిపోని ఆరోపణలు చేయడం, వ్యక్తిగత దూషణలకు దిగడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు.
జగన్ రెడ్డి జైలులో ఉన్నప్పుడు ఎవరు పార్టీని బతికించారో ప్రజలందరికీ తెలుసన్నారు. పార్టీని బతికించిందే తను అని స్పష్టం చేశారు. నేను లేక పోయి ఉండి వుంటే ఇవాళ నీవు సీఎంగా అయి ఉండే వాడివి కాదన్నారు. నీ వెనుక దుష్ట చతుష్టయం ఉందని, వారు ఏది చెబితే నమ్మి స్వంత చెల్లెలిపై అభాండాలు వేసే స్థాయికి దిగజారడం తనను మరింత బాధకు గురి చేసిందన్నారు.
మనిషిని మనిషిగా గుర్తించే తండ్రి రాజశేఖర్ రెడ్డి మంచి గుణం నీకు ఎందుకు రాలేదని ప్రశ్నించారు వైఎస్ షర్మిల. కష్టాల్లో ఉంటే ఎవరైనా, ఏ కులానికి చెందిన వారని చూడకుండా సాయం చేసిన మహానుభావుడు అని ఆయన పేరు చెప్పుకుని అధికారంలోకి వచ్చిన నీవు ఆశయాలను తుంగలో తొక్కావంటూ ద్వజమెత్తారు.
స్వంత చెల్లెలు అని చూడకుండా విమర్శలు, ఆరోపణలు, అభాండాలు వేయడం మంచి పద్దతి కాదని ఇకనైనా తెలుసు కోవాలన్నారు.