జగన్ పై భగ్గుమన్న షర్మిల
సునీతను కావాలని వేధించారు
అమరావతి – ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. ఆమె తన స్వంత సోదరుడు , ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై మండిపడ్డారు. కక్ష సాధింపు చర్యలకు దిగడం మంచి పద్దతి కాదన్నారు. తనను కూడా కావాలని లక్ష్యంగా చేసుకుని వ్యక్తిగత విమర్శలు చేయడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు.
తమ చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డిని దారుణంగా హత్య చేశారని, నిందితులను ఎవరు కాపాడుతున్నారో ప్రజలకు తెలుసని ఆరోపించారు వైఎస్ షర్మిలా రెడ్డి. అంతే కాకుండా వైఎస్ సునీతా రెడ్డిని మానసికంగా కొన్నేళ్ల పాటు ఇబ్బందులకు గురి చేస్తూ వచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు.
చివరకు తమ చిన్నాన్న పార్టీ కోసం ఎంతగానో కృషి చేశాడని అయినా పట్టించు కోలేదని, చివరకు హత్యకు గురైనా ఎవరు చేశారనే దానిపై ఇప్పటి వరకు కేసు కొలిక్కి రాలేదని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో జగన్ రెడ్డి అధికారాన్ని అడ్డం పెట్టుకుని తాను ఏది చేసినా చెల్లుబాటు అవుతుందనే భ్రమలో ఉన్నారని ఎద్దేవా చేశారు.
ఇవాళ తెలంగాణలో చోటు చేసుకున్న పరిణామాలను చూసైనా కనీసం మారితే బావుండేదన్నారు వైఎస్ షర్మిలా రెడ్డి.