జగన్ పాలన ఆగమాగం
ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల
కడప – ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆమె తన సోదరుడు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని టార్గెట్ చేశారు. హామీల పేరుతో జనాన్ని బురిడీ కొట్టించాడంటూ ధ్వజమెత్తారు. ప్రస్తుతం కడప ఎంపీగా బరిలో నిలిచారు షర్మిల కాంగ్రెస్ పార్టీ తరపున.
ఈ సందర్బంగా ప్రజా న్యాయ యాత్ర చేపట్టారు. ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు వైఎస్ షర్మిలా రెడ్డి. ప్రజల నుంచి అనూహ్యమైన స్పందన వస్తోందన్నారు షర్మిల. నవ రత్నాల పేరుతో ప్రజలను బురిడీ కొట్టించిన ఘనత జగన్ రెడ్డికే దక్కుతుందన్నారు.
అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం పాటు పడిన చరిత్ర తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి దక్కుతుందన్నారు వైఎస్ షర్మిలా రెడ్డి. రైతులు పండించిన పంటకు కనీస మద్దతు ధర కల్పించడంలో ఘోరంగా ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు.
రాష్ట్రంలో నవ రత్నాల పేరుతో ప్రజల చెవుల్లో పూలు పెట్టాడంటూ ధ్వజమెత్తారు జగన్ రెడ్డిపై. దౌర్జన్యాలు, దోపిడీలు, దారుణాలకు ఏపీ రాష్ట్రం కేరాఫ్ గా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు వైఎస్ షర్మిలా రెడ్డి.