గాడి తప్పిన జగన్ పాలన
ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల
గుంటూరు జిల్లా – ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ పాలన గాడి తప్పిందని మండిపడ్డారు ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి. ఎన్నికల ప్రచారంలో భాగంగా గుంటూరు జిల్లాలో జరిగిన సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. సంక్షేమం పేరుతో జనాన్ని బురిడీ కొట్టిస్తున్నారంటూ ధ్వజమెత్తారు.
విజయవాడ, సత్తెనపల్లి, గుంటూరు ప్రాంతాలలో మీరు కనబర్చిన ఆదరణ అద్భుతమన్నారు. పేరు పేరునా ధన్యవాదాలు తెలియ చేసుకుంటున్నట్లు చెప్పారు వైఎస్ షర్మిలా రెడ్డి. మీరంతా మద్దతు ఇస్తే కాంగ్రెస్ పవర్ లోకి వస్తుందన్నారు. రాష్ట్రం బాగు పడాలంటే హస్తం అధికారంలోకి రావాలన్నారు.
పేదల బతుకులు బాగు పడాలంటే, రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాలంటే, జగన్ ఇంటికి వెళ్లాల్సిన అవసరం ఉందన్నారు వైఎస్ షర్మిలా రెడ్డి. మీ సహకారంతో నియంత పాలకులను రాష్ట్రంలో లేకుండా చేస్తానని చెప్పారు. ప్రతి గడప గడపకు సంక్షేమ పథకాలు, ఫలాలు అందజేసేలా చేస్తానని అన్నారు ఏపీ పీసీసీ చీఫ్.
నవ రత్నాల పేరుతో నిట్ట నిలువునా జనాన్ని ముంచిన ఘనత జగన్ రెడ్డికే దక్కుతుందన్నారు.