NEWSANDHRA PRADESH

అన్న‌పై చెల్లెలు గుస్సా

Share it with your family & friends

జ‌గ‌న్ మారి పోయాడు

అమ‌రావ‌తి – ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిలా రెడ్డి నిప్పులు చెరిగారు. ఆమె త‌న సోద‌రుడు, వైసీపీ బాస్ , ఏపీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని టార్గెట్ చేశారు. రాష్ట్రంలో వైఎస్సార్ పాల‌న సాగ‌డం లేద‌న్నారు. కేవ‌లం జ‌గ‌న్ రెడ్డి త‌న తండ్రిని వాడుకుంటున్నాడ‌ని ఆరోపించారు. ఇలాంటి పాల‌న త‌మ‌కు వ‌ద్ద‌ని ప్ర‌జ‌లు వాపోతున్నార‌ని ఆ విష‌యం తెలుసుకుంటే మంచిద‌న్నారు.

త‌న‌పై వ్య‌క్తిగ‌త విమ‌ర్శ‌లు చేసినంత మాత్రాన తాను బెద‌ర‌న‌ని పేర్కొన్నారు. ఇవాళ త‌న‌పై కామెంట్స్ చేస్తున్న వారంతా త‌న అన్న జైలు పాలైన‌ప్పుడు ఎక్క‌డ ఉన్నారంటూ ప్ర‌శ్నించారు. వైఎస్సార్సీపీకి ఉనికి ప్ర‌శ్నార్థ‌క‌మ‌వుతుంద‌ని ఆలోంచించి , ఏ ప‌ద‌వి ఆశించ‌కుండా ఒక్క‌దానినే 3,200 కిలోమీట‌ర్ల మేర పాద‌యాత్ర చేప‌ట్టాన‌ని అన్నారు వైఎస్ ష‌ర్మిలా రెడ్డి. ఇదంతా నిస్వార్థంగా చేశాన‌ని గుర్తు చేశారు.

వైఎస్సార్సీపీ సోష‌ల్ మీడియా తాను చేసిన త్యాగం గురించి మ‌రిచి పోయిందంటూ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. తాను త‌న తండ్రి , దివంగ‌త సీఎం వైఎస్సార్ ఆశ‌యాల సాధ‌న కోస‌మే తాను కాంగ్రెస్ పార్టీలో చేరాన‌ని అన్నారు.