అమరావతి కాదది భ్రమరావతి
దీనికి కారకులు బాబు..జగన్
విజయవాడ – దేశంలో ఎక్కడా రాజధాని లేని రాష్ట్రం లేదని కానీ ఒక్క ఏపీకి మాత్రమే ఈ దుర్గతి పట్టిందని ఆవేదన వ్యక్తం చేశారు ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి. గురువారం ఎన్నికల ప్రచారంలో భాగంగా విజయవాడలో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్నారు. చేతిలో చిప్ప తప్పా ఏమీ లేదని అన్నారు.
సింగపూర్ చేస్తానంటూ నమ్మించాడని బాబుపై మండిపడ్డారు. త్రీడీ గ్రాఫిక్స్ చూపించి మాయ చేశాడని ఆరోపిచంఆరు. 30 వేల ఎకరాలు తీసుకున్నారని , యమునా నది నుంచి మట్టి తెచ్చారని, అయినా ఇప్పటి వరకు పూర్తయింది లేదన్నారు. కేవలం మట్టి మాత్రమే మిగిలి పోయిందన్నారు వైఎస్ షర్మిలా రెడ్డి.
అమరావతి చివరకు భ్రమరావతిగా మార్చేశారంటూ మండిపడ్డారు. హైదరాబాద్ తానే కట్టానని చెప్పాడని, దానిని మించి చేస్తానన్నాడని కానీ చివరకు తట్టెడు మట్టి పోయలేదన్నారు . బాబు హయాంలో తాత్కాలిక భవనాలు తప్పా ఒరిగింది ఏమీ లేదన్నారు. ఉద్యోగాలు లేవు, పరిశ్రమలకు దిక్కే లేదన్నారు.
ఇక జగన్ రెడ్డి గురించి ఎంత చెప్పినా తక్కువేనంటూ ఎద్దేవా చేశారు వైఎస్ షర్మిల. తాను పవర్ లోకి వస్తే వాషింగ్టన్ డీసీని చేస్తానన్నాడు. మూడు రాజధానులంటూ కాలయాపన చేశాడని, చివరకు ఒక్క రాజధాని కూడా లేదన్నారు. మోసం చేసిన బీజేపీని పట్టుకుని ఎందుకు వేలాడుతున్నారంటూ చీవాట్లు పెట్టారు వైఎస్ షర్మిలా రెడ్డి.