పవన్ కళ్యాణ్ కామెంట్స్ షర్మిల సీరియస్
రోజుకో తీరుగా మాట్లాడటం పద్దతి కాదు
విజయవాడ – ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు . ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై షాకింగ్ కామెంట్స్ చేశారు. ఒక బాధ్యత కలిగిన ఉప ముఖ్యమంత్రి పదవిలో ఉంటూ రాజ్యాంగ బద్దంగా ప్రమాణ స్వీకారం చేసిన వ్యక్తి ఇలా వేషం మార్చడం, ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడం తగదన్నారు. శుక్రవారం షర్మిలా రెడ్డి మీడియాతో మాట్లాడారు.
అధికారంలోకి రాక ముందు ఒక మాట ఇప్పుడు వచ్చాక పూర్తిగా వేష , భాషలను మార్చేశాడంటూ పవన్ ను ఉద్దేశించి సీరియస్ కామెంట్స్ చేశారు. ఇతర మతాలను కించ పర్చమని సనతాన ధర్మం చెప్పిందా అని ప్రశ్నించారు.
చివరకు స్థాయి మరిచి కోర్టులను కూడా విమర్శించే స్థాయికి దిగజారడం అహంకారానికి నిదర్శనమన్నారు. ఎవరు క్షమించినా ప్రజలు పవన్ కళ్యాణ్ ను క్షమించరని అన్నారు షర్మిల. ఒక మతానికి చెందిన వేషాన్ని వేసుకుని, ఆ మతమే ముఖ్యమని మాట్లాడుతుంటే..ఇతర మతాలకు అభద్రతాభావం ఉండదా అని నిలదీశారు.
ఎన్నికల్లో వారి ఓట్లు మీకు పడలేదా..? ఇతర మతాల వాళ్ళకు మనోభావాలు ఉండవా..? మతం అడ్డుపెట్టుకుని రాజకీయం చేయడం ఆర్ఎస్ఎస్ సిద్ధాంతమైతే.. అదే సిద్ధాంతానికి పవన్ కళ్యాణ్ డబుల్ ఏజెంట్ అయ్యాడంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.