వైసీపీ నేతలు లిక్కర్ డాన్ లు
ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల
అమరావతి – రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతోందని ఆవేదన చెందారు ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల. ఏపీ న్యాయ యాత్ర సందర్బంగా సోమవారం ఎన్నికల ప్రచారంలో పాల్గొని ప్రసంగించారు. లిక్కర్ వ్యాపారులుగా ఎమ్మెల్యేలు మారి పోయారంటూ ధ్వజమెత్తారు. అంబేద్కర్ వారసులమంటూ కల్తీ మద్యం ఎలా అమ్ముతారంటూ ప్రశ్నించారు.
జనాలు కిడ్నీలు, లివర్లు ఫెయిల్ అయ్యి చస్తున్నా పట్టించు కోవడం లేదని ఆరోపించారు వైఎస్ షర్మిల. ఈ పాపం లిక్కర్ మంత్రిది కాదా అని నిలదీశారు. మద్య నిషేధం అంటే సర్కార్ మద్యం అమ్మడమేనా అని అన్నారు. షుగర్ ఫ్యాక్టరీ ఏమైందని మండిపడ్డారు.
సంక్షేమ పథకాల పేరుతో జనాన్ని బురిడీ కొట్టిస్తున్నారంటూ ధ్వజమెత్తారు. 7 సార్లు విద్యుత్ చార్జీలు, 5 సార్లు ఆర్టీసీ ఛార్జీలు , నిత్యావసరాల ధరలు రెండింతలు పెంచారంటూ ఫైర్ అయ్యారు. బటన్ నొక్కడం అంటే ఇచ్చి తీసుకోవడం అన్నమాట అంటూ సెటైర్ వేశారు. రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేశారని ఫైర్ అయ్యారు.
5 ఏళ్లు అధికారం ఇస్తే గాడిదలు కాశారా , గుడ్డి గుర్రాలకు పళ్లు తోమారా అంటూ నిప్పులు చెరిగారు వైఎస్ షర్మిలా రెడ్డి.