వారికి ఓటేస్తే డ్రైనేజీలో వేసినట్టే
ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల రెడ్డి
అమరావతి – ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి నిప్పులు చెరిగారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఏపీ న్యాయ యాత్రలో భాగంగా ఆమె ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. జగన్ మోహన్ రెడ్డికి, చంద్రబాబు నాయుడు , పవన్ కళ్యాణ్, పురందేశ్వరికి చెందిన పార్టీలకు ఓటు వేస్తే మురుగు కాల్వలలో వేసినట్టేనని సంచలన వ్యాఖ్యలు చేవారు వైఎస్ షర్మిలా రెడ్డి.
ఆమె కర్నూలు జిల్లా ఆలూరు, ఆదోని, ఎమ్మిగనూరు నియోజకవర్గాలలో ప్రచారం చేశారు. సభలను విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలో పాలన గాడి తప్పిందని ఆవేదన వ్యక్తం చేశారు. మహా నాయకుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరు చెప్పుకుని అధికారంలోకి వచ్చిన జగన్ మోహన్ రెడ్డి చివరకు వాటిని అమలు చేయడం మరిచి పోయాడని ధ్వజమెత్తారు.
నాలుగున్నర ఏళ్ల పాటు అధికారంలో ఉంటూ ఏం చేశాడని, నిద్ర పోయి ఇప్పుడు మేలుకొన్నాడని ఆరోపించారు. రాష్ట్ర అభివృద్ది కేవలం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందని చెప్పారు. మీ బిడ్డల బంగారు భవిష్యత్తు మీరు వేసే ఓటుపై ఆధారపడి ఉందన్నారు.