జగన్ పాలన ఆగమాగం
ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల
అమరావతి – ఏపీలో అరాచక పాలన సాగిస్తున్న జగన్ మోహన్ రెడ్డిని, తన చిన్నాన్న హత్యలో తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డిని ఓడించాలని పిలుపునిచ్చారు. తాను సిసలైన రాయలసీమ బిడ్డనని, వైఎస్సార్ వారసురాలినని ఎవరికీ భయపడే రకం కాదన్నారు. కాంగ్రెస్ బస్సు యాత్రలో భాగంగా షర్మిలా రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేయడం కలకలం రేపింది.
వైఎస్సార్, వైఎస్ వివేకానంద రెడ్డి ఇద్దరూ రామ లక్ష్మణులు లాంటి వారని , వారు తమ జీవిత కాలమంతా ప్రజల కోసం కష్ట పడ్డారని చెప్పారు. అలాంటి తన చిన్నాన్నను దారుణంగా గొడ్డలితో నరికి చంపారని, ఆ పాపం ఊరికే పోదన్నారు. ఆయన ఉసురు తగలక తప్పదన్నారు. అవినాష్ రెడ్డి హంతకుడు అని సీబీఐ చెబుతోందన్నారు వైఎస్ షర్మిల.
అలాంటి హంతకుడికి టికెట్ ఎలా ఇస్తావంటూ జగన్ రెడ్డిని నిలదీసింది. ఆధారాలు, కాల్ రికార్డులు ఉన్నా ఎందుకని అరెస్ట్ చేయడం లేదంటూ ప్రశ్నించారు ఏపీ పీసీసీ చీఫ్. హత్య చేసి ఆపై ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశారంటూ ఆరోపించారు. ఇదేనా ప్రజా పాలన అంటే అని నిలదీశారు వైఎస్ షర్మిలా రెడ్డి.
జగన్ హత్య రాజకీయాలను పెంచి పోషిస్తున్నాడంటూ మండి పడ్డారు . అందుకే సీబీఐ విచారణ అవసరం లేదంటున్నాడని ఫైర్ అయ్యారు. తాడో పేడో తేల్చుకునేందుకే తాను అవినాష్ రెడ్డిపై పోటీకి దిగానని అన్నారు వైఎస్ షర్మిలా రెడ్డి.