NEWSANDHRA PRADESH

జ‌నం తీర్పు త్వ‌ర‌లో తేలుతుంది

Share it with your family & friends

వైఎస్ సునీతా రెడ్డి కామెంట్స్

అమ‌రావ‌తి – దివంగ‌త వైఎస్ వివేకానంద రెడ్డి త‌న‌యురాలు డాక్ట‌ర్ వైఎస్ సునీతా రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌జ‌లు ఎవ‌రికి ప‌ట్టం క‌డ‌తార‌నేది త్వ‌ర‌లో తేలుతుంద‌న్నారు. ఎవ‌రు మంచి చేస్తే వారికి ఓటు వేస్తార‌ని త‌న‌కు న‌మ్మ‌కం ఉంద‌న్నారు. దానికి అనుగుణంగానే తుది తీర్పు ఇస్తార‌ని ఇందులో ఎలాంటి అనుమానం అక్క‌ర్లేద‌న్నారు.

మోస పూరిత‌మైన హామీల‌తో ఎంత కాలం ఓట్లు అడుగుతారంటూ ప్ర‌శ్నించారు వైఎస్ సునీతా రెడ్డి. ఆమె ట్విట్ట‌ర్ వేదిక‌గా శుక్ర‌వారం స్పందించారు. ప్ర‌ధానంగా ఏపీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని టార్గెట్ చేశారు. ఇదే స‌మ‌యంలో త‌న సోద‌రి ఏపీ పీసీసీ చీఫ్ గా కొలువు తీరిన వైఎస్ ష‌ర్మిలా రెడ్డి తో క‌లిశారు. ఆమె కూడా సునీతా రెడ్డికి పూర్తి భ‌రోసా ఇచ్చారు.

ఇందుకు సంబంధించి కీల‌కమైన వ్యాఖ్య‌లు చేయ‌డం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. 2017లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో త‌న తండ్రి వివేకానంద రెడ్డి ఓడి పోయార‌ని , ఇందుకు ప్ర‌ధాన కార‌ణం స్వంత వాళ్లే ఓడించ‌డంలో కీల‌క పాత్ర పోషించార‌ని ఆరోపించారు.

ఆ విష‌యం త‌న తండ్రికి, త‌మ కుటుంబానికి కూడా తెలుస‌న్నారు. ఓడిస్తే సైలెంట్ అవుతార‌ని అనుకున్న వాళ్ల‌కు షాక్ ఇస్తూ తిరిగి పైకి లేచార‌ని, గెలిచి చూపించార‌ని అన్నారు.