వైఎస్ వివేకా అజాత శత్రువు
అయినా పొట్టన పెట్టుకున్నారు
కడప జిల్లా – వైఎస్ వివేకానంద రెడ్డి గురించి ఎంత చెప్పినా తక్కువేనని అన్నారు ఆయన కూతురు డాక్టర్ వైఎస్ సునీతా రెడ్డి. ఆమె పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోదరి , ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డితో కలిసి శనివారం జమ్మలమడుగు నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్బంగా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.
ఎవరికి ఏ ఆపద వచ్చినా, అది ఏ సమయంలోనైనా సరే తన తండ్రి వెళ్లే వారని, వారికి భరోసా కల్పించే వారని గుర్తు చేశారు. కానీ కొందరు కావాలని తన తండ్రిని పొట్టన పెట్టుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తన తండ్రిని చంపిన వాళ్లకు తన సోదరుడు జగన్ రెడ్డి టికెట్ ఇచ్చారని, ఇది ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు. ప్రజలు అన్నింటిని గమనిస్తున్నారని , తమ ఓటు ద్వారా గుణపాఠం చెప్పక తప్పదన్నారు సునీతా రెడ్డి.
తన తండ్రికి ఎవరూ శత్రువులు లేరని , కానీ అజాత శత్రువుగా పేరు పొందిన వివేకానంద రెడ్డిని అకారణంగా పొట్టన పెట్టుకున్నారంటూ కన్నీటి పర్యంతం అయ్యారు. పని కావాలంటే తన వద్దకు వెళితే అవుతుందన్న నమ్మకాన్ని కలిగించారని చెప్పారు. ఇక్కడి నుంచి వెళ్లే వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ కు ఆ విషయం తెలుసన్నారు. ఆయన ఎంపీ అయినా సాధారణంగానే ట్రైన్ లో ప్రయాణం చేశారన్నారు.
అవినాష్ రెడ్డి ఓటమే తమ అంతిమ లక్ష్యమని ప్రకటించారు డాక్టర్ సునీతా రెడ్డి. ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి.