భారతిపై భగ్గుమన్న సునీత
జగన్ రెడ్డిది నేర చరిత్ర
కడప జిల్లా – దివంగత వైఎస్ వివేకానంద రెడ్డి కూతురు డాక్టర్ వైఎస్ సునీతా రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. గత కొంత కాలం నుంచీ ఆమె సంచలన ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. ఎన్నికల సమయంలో కీలక వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇప్పటికే సోదరి వైఎస్ షర్మిలతో కలిసి ఆమె పెద్ద ఎత్తున ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. ఇదిలా ఉండగా షర్మిల ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి చీఫ్ గా ఉన్నారు. ఆమె ఈసారి ఎన్నికల్లో కడప లోక్ సభ స్థానం నుంచి బరిలో నిలిచారు.
ఆమె తెలంగాణలో వైఎస్సార్ తెలంగాణ పార్టీని స్థాపించారు. ఆ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేశారు. ప్రస్తుతం తన స్వంత ప్రాంతమైన కడప నుంచే ఎన్నికల్లో పోటీ చేయడం ఒకింత ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇదే సమయంలో అక్కా చెల్లెళ్లు షర్మిల, సునీతా రెడ్డిలు జగన్ మోహన్ రెడ్డిని టార్గెట్ చేశారు. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ప్రస్తుత ఎంపీ అవినాష్ రెడ్డి హస్తం ఉందంటూ ఆరోపించారు. తాజాగా ఓ అడుగు ముందుకేసి వైఎస్ సునీతా రెడ్డి ఏకంగా భారతీ రెడ్డిపై నిందలు మోపారు. ఆమెది నేర పూరితమైన మనస్తత్వమని ఆరోపించారు.