హాట్ టాపిక్ గా మారిన భేటీ
కడప – ఏపీలో రాజకీయాలు వేడిని రాజేస్తున్నాయి. నిన్నటి దాకా కేవలం వైసీపీ, టీడీపీ, జనసేన, బీజేపీ అనుకున్నారు జనం. కానీ సీన్ మారింది..పరిస్థితి కూడా పూర్తిగా మారి పోయింది. ఇప్పుడు ఆ పార్టీలతో పాటు కాంగ్రెస్ పార్టీ తిరిగి పుంజుకునే పనిలో పడింది. ఉన్నట్టుండి ఆ పార్టీకి దివంగత కాంగ్రెస్ నాయకుడు, మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరు తోనే ముందుకు వెళుతోంది. ఇదే సమయంలో ఎవరూ ఊహించని రీతిలో ఆయన కూతురు వైఎస్ షర్మిలా రెడ్డిని తీసుకు వచ్చింది.
ఆమెకు ఏపీ పీసీసీ చీఫ్ గా బాధ్యతలు అప్పగించింది. కొలువు తీరిన వెంటనే తన దూకుడు పెంచారు. సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ప్రత్యేకించి తన సోదరుడు సీఎం జగన్ మోహన్ రెడ్డితో పాటు మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడును సైతం ఏకి పారేస్తున్నారు.
ఎక్కడా తగ్గడం లేదు. పదే పదే రాష్ట్ర సమస్యలను ప్రస్తావిస్తున్నారు. ప్రజలను చైతన్యవంతం చేసే పనిలో పడ్డారు. చంద్రబాబు అమరావతి రాజధాని పేరుతో రాజకీయం, వ్యాపారం చేశారని, ఇక జగన్ మోహన్ రెడ్డి మూడు రాజధానుల పేరుతో మంసం చేశాడని ఆరోపించారు. ఇదిలా ఉండగా వైఎస్ వివేకానంద రెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. ఆయన కూతురు సునీత తో కలిసి షర్మిల వైఎస్ కు నివాళులు అర్పించారు. ప్రస్తుతం వీరిద్దరి కలయిక హాట్ టాపిక్ గా మారింది.