విజయమ్మ లేఖకు వైసీపీ కౌంటర్
మరో లేఖ విడుదల చేసిన జగన్ రెడ్డి
అమరావతి – దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి భార్య వైఎస్ విజయమ్మ లేఖ రాయడం కలకలం రేపింది. తమకు ఇద్దరు పిల్లలు రెండు కళ్లు లాంటి వారని పేర్కొన్నారు. జగన్ మోహన్ రెడ్డితో పాటు వైఎస్ షర్మిలకు కూడా వాటాలు ఉంటాయని స్పష్టం చేశారు. ఇందులో ఎవరికీ ఎలాంటి ప్రమేయం అవసరం లేదని స్పష్టం చేశారు వైఎస్ విజయమ్మ.
జగన్ రెడ్డి వాటాలు ఇచ్చేది లేదంటూ తల్లి విజయమ్మ, సోదరి షర్మిలకు స్పష్టం చేశారు. దీనిపై తీవ్ర అభ్యంతరం తెలిపారు విజయమ్మ. ఈ మేరకు వివరణతో కూడిన లేఖ రాశారు. ప్రస్తుతం ఆమె రాసిన లేఖ చర్చనీయాంశంగా మారింది.
దీనిపై తీవ్రంగా స్పందించింది వైఎస్సార్సీపీ . దివంగత మహానేత వైయస్సార్‌గారి భార్యగా, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైయస్.జగన్మోహన్‌రెడ్డిగారి తల్లిగా విజయమ్మని అమితంగా గౌరవిస్తామని తెలిపింది.
వైయస్సార్ కుటుంబ వ్యవహారంపై విజయమ్మ బహిరంగ లేఖ విడుదల చేసిన నేపథ్యంలో కొన్ని అంశాలను ఆమె ముందుకు, ప్రజల ముందుకు తీసుకు వస్తున్నామని స్పష్టం చేసింది.